Begin typing your search above and press return to search.

అల్లు స్నేహ ఫస్ట్ డంప్.. మెగా కోడళ్లతో అలా.. ఫ్రెండ్స్ తో ఇలా

తాజాగా అల్లు స్నేహ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. జనవరి డంప్ పేరుతో ఈ మంత్ లో తన స్పెషల్ పిక్స్ ను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 12:38 PM GMT
అల్లు స్నేహ ఫస్ట్ డంప్.. మెగా కోడళ్లతో అలా.. ఫ్రెండ్స్ తో ఇలా
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల భార్యల్లో కొందరు మాత్రమే సోషల్‌ మీడియా లో యాక్టివ్‌ గా ఉంటారు. మహేశ్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డితో పాటు ఇంకొందరు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు. వారిలో అల్లు స్నేహకు ఇన్ స్టాలో 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

తరచూ అల్లు అర్జున్, కొడుకు అయాన్, కూతురు అర్హ ఫొటోలను షేర్ చేస్తుంటారు స్నేహ. వారికి సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల అల్లు స్నేహ తన పేరెంటింగ్ మంత్ర అంటూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో ముఖ్యంగా 6 పాయింట్స్ చెప్పారు. అయితే స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో ఇప్పటికీ వైరల్ గా ఉంది.

తాజాగా అల్లు స్నేహ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. జనవరి డంప్ పేరుతో ఈ మంత్ లో తన స్పెషల్ పిక్స్ ను షేర్ చేశారు. లవ్లీ పర్సన్స్ తో ఈ సంవత్సరం స్టార్ట్ చేసినట్లు తెలిపారు. న్యూ ఇయర్ పార్టీలో మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠితో స్టైలిష్ గా దిగిన పిక్ ను షేర్ చేశారు. మరో పిక్ లో కూతురు అర్హతో క్యూట్ గా పోజు ఇచ్చారు. ఇటీవలే తిరుమల విజిట్ చేసిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో బన్నీ- స్నేహ జంట ఒకటి. వీరి పెళ్లి ఎప్పటికీ మరిచిపోలేనంతగా జరిగింది. 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. చాలామంది సెలబ్రిటీల్లా అల్లు అర్జున్- స్నేహ జంటకు చిన్ననాటి పరిచయం లేదు. అమెరికాలో జరుగుతున్న ఒక శుభాకార్యానికి బన్నీ వెళ్లారు. స్నేహా రెడ్డి కూడా సరిగ్గా ఆ వేడుకకు వచ్చారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు బన్నీకి స్నేహను పరిచయం చేశాడు. ఇక తొలిచూపులోనే స్నేహతో ప్రేమలో పడ్డారు బన్నీ.

ఆ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేదు. ఆ శుభకార్యం తర్వాత మళ్లీ వాళ్లద్దరూ మాట్లాడుకుంది లేదు. కానీ బన్నీ మాత్రం స్నేహను మర్చిపోలేకపోయారు. ఆ తర్వాత కొన్నినెలలకు స్నేహకు ఒక మెసేజ్‌ చేశారు. అటు నుంచి కూడా స్పందన వచ్చింది. మళ్లీ ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని అనుకున్నారు. అలా ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకునేందుకు పలుమార్లు కలిసి మాట్లాడుకుని ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.