Begin typing your search above and press return to search.

బన్నీ కోసం AI బ్యూటీ?

త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోనే ఈ ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:30 PM GMT
బన్నీ కోసం AI బ్యూటీ?
X

ఈ మధ్యకాలం లో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింట్లోనూ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది. ఈ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఓ న్యూస్ యాంకర్ ని కూడా తయారు చేశారు. దానితోనే న్యూస్ చదివించారు. అది చూసి అందరూ షాకయ్యారు.

అయితే, ఇప్పుడు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని ఉపయోగించి హీరోయిన్ గా కూడా తీసుకురావాలని అనుకుంటున్నారట. అది ఏ హాలీవుడ్ లోనో, బాలీవుడ్ లోనే కాదు. మన టాలీవుడ్ లోనే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లో హీరోయిన్ గా ఏఐ బ్యూటీని తీసుకోవాల ని అనుకుంటన్నారట.

త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోనే ఈ ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటున్నారట. అందంగా మెరిసిపోయేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ విషయం లో ఇప్పటి వరకు అయితే, అధికారిక ప్రకటన రాలేదు. మరి, త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ఈ మూవీ లో అల్లు అర్జున్ పాత్ర విషయంలోనూ త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహాభారతం లోని ఓ పాత్రను ఇన్సిపిరేషన్ గా తీసుకొని డిజైన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మహాభారతం లోని పర్వాల కు మోడ్రన్ టచ్ ఇచ్చి కథను తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 మూవీ లో నటిస్తున్నారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కాగా, దానికి సీక్వెన్స్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది

పుష్ప2 తర్వాత పుష్ప3 కూడా వస్తుందని మరో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు త్రీక్వెల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ ఫ్రాంచైజీగా చేయాలనే ఉద్దేశ్యంతో పుష్పకు సిద్ధం చేసినట్లు ఆన్‌లైన్‌ లో గాసిప్ చక్కర్లు కొడుతోంది. పుష్ప 3: ది రూల్ బిగిన్స్ అనే పేరు పెట్టారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.