Begin typing your search above and press return to search.

కేన్స్ లో ఇండియన్‌ మూవీకి స్టాండింగ్‌ ఒవేషన్‌

30 ఏళ్ల తర్వాత ఓ ఇండియన్‌ సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాంపిటీషన్ లో నిలవడం జరిగింది.

By:  Tupaki Desk   |   24 May 2024 8:09 AM GMT
కేన్స్ లో ఇండియన్‌ మూవీకి స్టాండింగ్‌ ఒవేషన్‌
X

ప్రతి సంవత్సరం ఇండియన్ సినీ ప్రేక్షకులు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గురించి వినడం, మాట్లాడుకోవడం, వార్తలు చూడటం తప్ప మన ఇండియన్‌ సినిమాలు అక్కడ సందడి చేయడం చాలా చాలా తక్కువ. 30 ఏళ్ల తర్వాత ఓ ఇండియన్‌ సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాంపిటీషన్ లో నిలవడం జరిగింది.

కేన్స్ ఉత్సవంలో భాగంగా పామ్‌ డి ఓర్‌ అవార్డు కేటగిరీలో మన మలయాళ సినిమా 'ఆల్ వి ఇమేజిన్‌ యూజ్‌ లైట్‌' పోటీలో నిలిచింది. మధ్య తరగతి యువతుల జీవితాలను మరియు వారి మనోభావాలను చూపిస్తూ సాగే ఎమోషనల్‌ డ్రామా ఈ సినిమా. మంచి ఆదరణ లభించింది.

రెండు గంటల నిడివితో సాగిన ఈ సినిమాను కేన్స్‌ లో ప్రదర్శించారు. సినిమా పూర్తి అయిన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాకు మరియు యూనిట్‌ సభ్యులకు స్టాండింగ్‌ ఒవేషన్ ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం. మొత్తానికి కేన్స్ లో ఈసారి మన ఇండియన్ సినిమా సందడి చేయడం ఆనందించే విషయం.

పాయల్‌ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ఆల్‌ వి ఇమేజిన్ యాజ్ లైట్‌ సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు దక్కాయి. 1994 లో స్వహం సినిమా ఈ కేటగిరిలో పోటీ పడింది. సరిగ్గా 30 ఏళ్లకు కేన్స్ లో ఇండియన్‌ సినిమా నిలిచింది.

ఈ సినిమా మాత్రమే కాకుండా పలువురు ఇండియన్‌ సెలబ్రిటీలు రెడ్‌ కార్పెట్‌ పై సందడి చేశారు. అంతే కాకుండా మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ ను కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో విడుదల చేసిన విషయం తెల్సిందే. మొత్తానికి ఈసారి కేన్స్ లో ఇండియన్‌ సినిమా సందడి కనిపించింది.