Begin typing your search above and press return to search.

2025 సంక్రాంతి.. మెగాస్టార్ తో పాటూ ఆ సినిమాలు కూడా?

బింబిసారా మూవీ ఫేమ్ శిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న 'Mega156' విశ్వంభర ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 12:22 PM GMT
2025 సంక్రాంతి.. మెగాస్టార్ తో పాటూ ఆ సినిమాలు కూడా?
X

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2024 సంక్రాంతి సీజన్ లో సినిమాల మధ్య ఎలాంటి పోటీ నెలకొందో చూశాం. ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇక వచ్చే సంక్రాంతి సీజన్లోనూ భారీ పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 2025 సంక్రాంతికి మొట్టమొదట బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బింబిసారా మూవీ ఫేమ్ శిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న 'Mega156' విశ్వంభర ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాతో పాటు వచ్చే సంక్రాంతి బరిలో మరికొన్ని సినిమాలు నిలవనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో 2017 లో వచ్చిన 'శతమానంభవతి' సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.

కుటుంబ బంధాలను ఎంతో ఎమోషనల్ గా చూపించిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన అందుకోవడంతోపాటు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 2017 సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాగా వాటితో పోటీపడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోంది.

ఈరోజు సంక్రాంతి కానుకగా సీక్వెల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'శతమానంభవతి నెక్స్ట్ పేజీ' అనే టైటిల్ తో పోస్టర్ విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తెరకెక్కనున్న రెండో మూవీ అదే హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

అటు కింగ్ నాగార్జున 'బంగార్రాజు పార్ట్-3' ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు వచ్చే సంక్రాంతి రేసులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి వచ్చే సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో సినిమా పండగ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.