కొత్త కోడలకి అత్త సలహాల అవసరం లేదు! అమల
'ఆమె చాలా టాలెంటెడ్. ఎంతో మెచ్చూర్డ్ గా ఉంటుంది. ఆ అమ్మాయికి నేను ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఆమె తప్పకుండా ఓ మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలన్నదే నా కోరిక.
By: Tupaki Desk | 2 Dec 2024 9:46 AM GMTఅక్కినేని బ్రదర్స్ నాగచైతన్య- అఖిల్ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య నటి శోభితా ధూళిపాళను ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు. అలాగే అనూహ్యంగా అఖిల్ కూడా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇది ఏమాత్రం ఊహించకుండా తెరపైకి వచ్చిన అంశం. ముంబైకి చెందిన చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహం జరుగుతుంది.
ఇటీవలే నిశ్చితార్దం ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ రెండు వివాహాల పాట్ల తండ్రి నాగార్జున ఎంతో సంతోషంగా ఉన్నారు. తన సంతోషాన్ని మీడియాతో సైతం పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున సతీమణి అమల కూడా స్పందించారు. 'కొత్త కోడలికి ఏవైనా సలహాలు లాంటివి ఇస్తున్నారా? అని అడిగితే..
'ఆమె చాలా టాలెంటెడ్. ఎంతో మెచ్చూర్డ్ గా ఉంటుంది. ఆ అమ్మాయికి నేను ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఆమె తప్పకుండా ఓ మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలన్నదే నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్ బాగుండాలిని ఆశీస్సులు ఇవ్వాలిని కోరుకుంటున్నా' అన్నారు. పిల్లల విజయాలు ఎక్కువ? విద్యార్ధుల విజయాలు ఎక్కువా? అంటే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్నిస్తాయి. కానీ నిజం చెప్పాలంటే? నా విద్యార్దుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్ని పంచుతాయి' అన్నారు. ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం ఇదే తొలిసారి. సంస్థ డైరెక్టర్ గా ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది.