Begin typing your search above and press return to search.

అమలా పాల్.. బికినీ కంటే ఘాటుగా..

చాలా కాలంగా ఈ చిన్నది దక్షిణాదిలో స్టార్‌గా సత్తా చాటుతోంది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 1:11 PM GMT
అమలా పాల్.. బికినీ కంటే ఘాటుగా..
X

సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో సినిమాలు చేస్తూ యమా హైలెట్ అవుతున్నారు. ఫలితంగా వరుసగా ప్రాజెక్టులను చేస్తూ మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో అందమైన భామ అమలాపాల్ ఒకరు. చాలా కాలంగా ఈ చిన్నది దక్షిణాదిలో స్టార్‌గా సత్తా చాటుతోంది.


‘నీలి తామర’ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టిన అమలా పాల్.. చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలోని చాలా భాషల్లో ఎక్కువ సినిమాలు చేసింది. తద్వారా స్టార్‌గా మారిపోయింది. అయితే, వివాహం, విడాకుల వల్ల పర్సనల్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ అమ్మడు.. మళ్లీ కెరీర్‌ను రీస్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రాలను చేస్తూ వస్తోంది.


దక్షిణాది స్టార్ హీరోయిన్ అమలా పాల్ కొంత కాలం క్రితమే జగత్ దేశాయ్‌ అనే తన ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలతో అలరించిన ఆమె.. కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయింది. అప్పటి నుంచి మూవీలకు మాత్రం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక, ఇటీవలే అమలా పాల్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తన బిడ్డతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతోంది.


ఈ మధ్య కాలంలో తల్లైన కారణంగా సినిమాలకు విరామం ప్రకటించిన అమలా పాల్.. తన ఫ్యాన్స్‌ కోసం ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు, విశేషాలను వాళ్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.


సోషల్ మీడియాలో ఆరంభం నుంచే అమలా పాల్ అందాల విందు చేస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే ఎక్కువగా గ్లామర్ షో చేస్తోన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇక ఊహించని విధంగా ఈ చిన్నది ప్రస్తుతం గ్లామర్ తో హీటెక్కిస్తోంది. అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఎద అందంతో షాక్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లోనే అద్భుతమైన వైరల్ అయ్యాయి.