Begin typing your search above and press return to search.

వైరల్: గుర్తుపట్టని విధంగా అమలా పాల్

ఈ క్రమంలోనే తాజాగా అమలా పాల్ తీసుకున్న కొన్ని పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:51 PM GMT
వైరల్: గుర్తుపట్టని విధంగా అమలా పాల్
X

సినిమా రంగంలోకి చాలా మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన సినిమాలు, పాత్రలు లేదా మరికొన్ని విషయాలతో సెన్సేషన్‌గా మారుతుంటారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. అందంతో పాటు నటనతోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ మొత్తంలో మంచి ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకుని సత్తా చాటుతోంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత విజయ్‌ కుటుంబంతో అమలా పాల్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. విజయ్‌తో విడిపోయిన తర్వాత అమలా పాల్ మళ్లీ కెరీర్‌ మీద ఫోకస్ చేసి వరుసగా మూవీలు చేస్తోంది.

అనంతరం తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇచ్చిన పార్టీకి హాజరైన ఆ కుర్రాడు.. అందరి ముందే ప్రపోజ్ చేశాడు. అనంతరం వీళ్లిద్దరూ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. ఇక, వివాహం చేసుకున్న కొంత కాలానికే అమలా పాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఓనమ్ సందర్భంగా తన కొడుకు ఫొటోలను కూడా పంచుకుంది.

తల్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోన్న స్టార్ హీరోయిన్ అమలా పాల్.. తన ఖాళీ సమయాన్ని మాత్రం ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమలా పాల్ తీసుకున్న కొన్ని పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

అమలా పాల్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను కాస్త ఆశ్చర్యం కలిగించాయి. దీనికి కారణం ఆమె గతంలో కంటే చాలా బొద్దుగా కనిపించడమే. ఈ లుక్కులో కూడా ఆమె చాలా అందంగా ఉందని అంటున్నారు. అంతేకాదు, కాసింత గ్లామర్ షో కూడా చేస్తూ ఈ ముద్దుగుమ్మ రచ్చ లేపేసింది. ఇంకేముంది.. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా అసలు ఆమెను గుర్తు పట్టలేకపోయాం అంటూ చాలా మంది చెబుతున్నారు. దీంతో అమలా పాల్ సినిమాలు చేయకున్నా మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.