#మమ్మీ వైబ్స్.. అమలాపాల్ బేబి బంప్ లుక్
అందాల కథానాయిక అమలా పాల్ తన మొదటి బిడ్డను ఆశిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 25 May 2024 11:30 AM GMTఅందాల కథానాయిక అమలా పాల్ తన మొదటి బిడ్డను ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అమలా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను బట్టి తను ఇప్పటికే నిండు గర్భిణి అని స్పష్ఠత వచ్చింది. తాజాగా అమలాపాల్ తన చిత్రం `లెవల్ క్రాస్` ఆడియో వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక కోసం డీప్ V- నెక్ ధరించి అందమైన ఆఫ్-వైట్ దుస్తులలో కనిపించింది. తన అలంకరణలో సింప్లిసిటీ ఆకట్టుకుంది. అభిమానులు అమలాపై తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ లవ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేసి ప్రశంసించారు. మొదటి బిడ్డను స్వాగతిస్తున్న అమలాపాల్ కి శుభాకాంక్షలు తెలిపారు.
అభిషేక్ ఫిలింస్ నిర్మించిన `లెవెల్ క్రాస్` ఫిల్మ్ ఈవెంట్ కి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకనిర్మాత జీతు జోసెఫ్.. దర్శకుడు అర్ఫాజ్ అయూబ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో సీడీని అధికారికంగా ఆవిష్కరించి ప్రధాన పాత్రధారి ఇంద్రన్స్కి అందించారు. లెవెల్ క్రాస్ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించారు.
కేరళలో ఎప్పుడూ ప్రజలు చూడని కథ ఇది. దీని కోసం మేము ట్యునీషియాకు వెళ్లాము. ట్యునీషియాలో చిత్రీకరించిన తొలి భారతీయ సినిమా లెవెల్ క్రాస్ అని గర్వంగా చెప్పగలను అని అన్నారు. నిజానికి అమలా పాల్, గత ఏడాది డిసెంబర్లో తాను గర్భం దాల్చిన విషయాన్ని షేర్ చేసింది. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెరుగుతున్న బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసింది. మాతృత్వం వైపు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించింది. అమలాపాల్ తెలుగు, తమిళంలో నటిగా బిజీగా ఉంది. కానీ వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విజయ్ నుంచి విడిపోయిన అమలాపాల్ వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట తొలి బిడ్డను ఆశిస్తోంది.