Begin typing your search above and press return to search.

క్యూట్ కిడ్ తో సీనియర్ హీరోయిన్.. ట్విన్సా?

పెళ్లైన మూడు నెలలకే ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది.

By:  Tupaki Desk   |   20 March 2024 12:29 PM GMT
క్యూట్ కిడ్ తో సీనియర్ హీరోయిన్.. ట్విన్సా?
X

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఇటీవల తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త జగత్‌ దేశాయ్‌తో గతేడాది ఏడడుగులు వేసింది. పెళ్లైన మూడు నెలలకే ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది. బేబీ బంప్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.


మాతృక్షణాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ కబుర్లను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. కొత్త కొత్త బేబీ బంప్ పిక్స్ ను షేర్ చేస్తోంది. ఇటీవల తన భర్త పై ఫన్నీ కామెంట్స్ చేసింది. తను మాత్రమే కాదు తన భర్త కూడా ప్రెగ్నెంట్ అంటూ సరదాగా పోస్ట్ పెట్టింది. కొన్ని రోజుల క్రితం పబ్ లో డాన్స్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంది. గర్భంతో ఇలా డ్యాన్సులేంటి చాలా మంది కామెంట్ చేశారు.


తాజాగా స్పెషల్ పోస్ట్ పెట్టింది అమలాపాల్. 2 హ్యాపీ కిడ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక బుజ్జి పాపాయిని పట్టుకుని నవ్వుతూ కనిపించింది. తన ఒడిలో పాప ఉండగా.. ఆమెకు మేకప్ చేస్తున్నారు బ్యూటీషియన్లు. ప్రస్తుతం అమలాపాల్ కొత్త పిక్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే అమలా పాల్ నవ్వు ఎవర్ గ్రీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


అయితే అమలాపాల్ క్యాప్షన్ బట్టి.. ఆమె ట్విన్స్ కు జన్మనివ్వనుందేమోనని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. బెజవాడ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇద్దరమ్మాయిలు, నాయక్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో మళ్లీ తమిళ చిత్రసీమకు వెళ్లిపోయింది. లేడీ ఓరియంటెడ్‌, అతిథి పాత్రలోతోపాటు ఆడపదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ లో రాణిస్తోంది.

ఇక 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్‍ ను అమలాపాల్ లవ్ మ్యారేజ్ చేసుకుంది. పలు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లైన మూడేళ్లకే 2017లో విజయ్‌ తో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత వ్యాపారవేత్త జగత్ దేశాయ్‍ తో లవ్ లో పడింది. కొంతకాలం సీక్రెట్‌ రిలేషన్‌ లో ఉన్న వీరు.. 2023లో కొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.