వీడియో: బేబి బంప్‌తో అమలాపాల్ ఏంటిలా?
వైవిధ్యమైన పాత్రలు, విలక్షణమైన నటనతో మెప్పించిన అమలాపాల్ ఇప్పటికీ ప్రయోగాల బాటలోనే వెళుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 May 2024 8:30 AM GMTవైవిధ్యమైన పాత్రలు, విలక్షణమైన నటనతో మెప్పించిన అమలాపాల్ ఇప్పటికీ ప్రయోగాల బాటలోనే వెళుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విజయ్‌తో ప్రేమ పెళ్లి.. అనంతరం కలతలతో విడాకుల గురించి తెలిసిందే. బ్రేకప్ తర్వాత కొన్నేళ్ల పాటు నటనలో కొనసాగిన అమలాపాల్ 5 నవంబర్ 2023న కొచ్చిలో తన స్నేహితుడు జగత్ దేశాయ్ ని పెళ్లాడింది. ఈ ఏడాది జనవరి 3న అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తాను ఫ్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించింది.
అమలా పాల్ ప్రస్తుతం మాతృత్వంలోని అందమైన ప్రయాణాన్ని ఆస్వాధిస్తోంది. తన భర్త జగత్ దేశాయ్‌తో తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. తన కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని గడుపుతోంది. అంతేకాదు..
అమలా పాల్ ఎలాంటి భేషజం లేకుండా ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ బేబి బంప్ కి సంబంధించిన బహిరంగంగా ప్రదర్శనలు ఇస్తోంది. ఇప్పుడు తనకు తొమ్మిది నెలలు. తన బేబీ బంప్‌ను పట్టుకుని అందమైన డ్యాన్స్ చేస్తున్న వీడియోను అమలాపాల్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఫహద్ ఫాసిల్‌తో కలిసి 2013 మలయాళ చిత్రం 'ఒరు ఇండియన్ ప్రణయకధ'లోని 'ఓమన పూవే' పాట నేపథ్యంలో వినిపిస్తుండగా, పాల్ డ్యాన్సులు చేసింది. దీంతో ఈ పాటతో ఇప్పటికీ ప్రేమలో ఉందని అభిమానులు ఆనందిస్తున్నారు.
సంతోషంగా థ్రిల్లింగ్ గా ఉన్న అమలాపాల్ చిన్నపిల్లలా కనిపించిందని అభిమానులు వ్యాఖ్యానించారు. అమల డ్యాన్సులు చూశాక.. తన భర్త జగత్ దేశాయ్ స్పందిస్తూ ఇన్ స్టాలో కొన్ని లవ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు. 2013లో సత్యన్ అంతికాడ్ రూపొందించిన 'ఒరు ఇండియన్ ప్రణయకథ'లో అమలాపాల్ పాత్రకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ పాటలో ఆమె ఫహద్‌కు నకిలీ భార్యగా నటించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అమలా పాల్ చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి బ్లెస్సీ తెరకెక్కించిన 'ఆడుజీవితం -ది గోట్ లైఫ్'లో కనిపించింది. సర్వైవల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది.