Begin typing your search above and press return to search.

1+1= 3 అమ‌లాపాల్

లైఫ్‌లో వివాదాలు ఎగుడు దిగుడు ప్ర‌యాణాలు స‌ర్వ‌సాధార‌ణం. అలాంటి ప్ర‌యాణ అనుభవాలు మ‌ల‌యాళీ బ్యూటీ అమ‌లాపాల్ కి ఉన్నాయి

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:02 AM GMT
1+1= 3 అమ‌లాపాల్
X

లైఫ్‌లో వివాదాలు ఎగుడు దిగుడు ప్ర‌యాణాలు స‌ర్వ‌సాధార‌ణం. అలాంటి ప్ర‌యాణ అనుభవాలు మ‌ల‌యాళీ బ్యూటీ అమ‌లాపాల్ కి ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి పాజిటివ్ గా ఆలోచించి కొత్త దారిలో వెళ్లి ఆనంద‌క‌ర జీవితాన్ని సాగించ‌డం ముఖ్యం. ఇటీవ‌లే అమలా పాల్ .. త‌న చిర‌కాల స్నేహితుడు జగత్ దేశాయ్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జంట శుభ‌వార్త చెప్పింది. 1+1=3 అంటూ త‌మ జీవితాల్లోకి మూడో వ్య‌క్తి ప్ర‌వేశిస్తున్నాడ‌ని అమ‌లాపాల్ వెల్ల‌డించింది. ఇద్దరు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని ప్రకటించారు. పాల్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నుండి అరుదైన‌ ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. నవంబర్ 5న కేరళలోని కొచ్చిలో అమల, జగత్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట కొత్త ప్రయాణం స‌రిగ‌మ‌ల గురించి అభిమానులు స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.


అమలా పాల్ -జగత్ దేశాయ్ 26 అక్టోబర్ 2023న నిశ్చితార్థం చేసుకున్నారు. అతడు ఆమె పుట్టినరోజున ఒక ఉంగరంతో పెళ్లికి ప్రపోజ్ చేశాడు. జనవరి 3న అమల- జగత్ ప్రెగ్నన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్ర‌స్తుతం బేబీ బంప్ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ''మీతో 1+1 3 అని ఇప్పుడు నాకు తెలుసు! (sic)'' అని ఈ పోస్ట్‌కు శీర్షిక పెట్టారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా సేల్స్ హెడ్ అని సమాచారం. 2023 నవంబర్‌లో వివాహం చేసుకునే ముందు ఇద్దరూ కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు.


కాబోయే తల్లిదండ్రులకు అభినందనలు


అమలా పాల్ సౌత్ లో పాపుల‌ర్ హీరోయిన్. ప్రధానంగా తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటిస్తోంది. చివరిగా మమ్ముట్టి 'క్రిస్టోఫర్'లో కనిపించింది. అజయ్ దేవగన్ 'భోలా'లో అతిధి పాత్రలో నటించింది. పృథ్వీరాజ్- దర్శకుడు బ్లెస్సీ కాంబినేష‌న్ లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చిత్రం 'ఆడుజీవితం' విడుదల కోసం వేచి ఉంది. ఆసిఫ్ అలీ- ష్రాఫుదీన్ కాంబోలో 'లెవల్ క్రాస్'లోను న‌టిస్తోంది.