Begin typing your search above and press return to search.

స్త్రీ 3.. ఇంత‌లోనే ఈ దూకుడేంటి?

అమ‌ర్ కౌశిక్ తెర‌కెక్కించిన `స్త్రీ 2` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 2:51 AM GMT
స్త్రీ 3.. ఇంత‌లోనే ఈ దూకుడేంటి?
X

అమ‌ర్ కౌశిక్ తెర‌కెక్కించిన `స్త్రీ 2` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. స్త్రీ విడుద‌ల‌య్యాక చాలా గ్యాప్ తో వ‌చ్చినా కానీ, అభిమానుల ఉత్సాహం న‌డుమ‌ విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 600 కోట్ల జీవితకాల బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను సాధించింది. శ్ర‌ద్ధా క‌పూర్, రాజ్‌కుమార్ రావుల న‌ట‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా `స్త్రీ 3`ని రూపొందించేందుకు మేక‌ర్స్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

స్ట్రీ 2: సర్కాటే కా ఆటంక్ క‌థ‌ను నిరెన్‌భట్ అందించారు. అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో మాడాక్ ఫిల్మ్స్ - జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో మ‌రో సీక్వెల్ చిత్ర‌మిది. స్త్రీ 2లో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా స్నేహితుల బృందంగా నటించారు. వారంతా చందేరీలోని మహిళలను అపహరించే తలలేని దుర్మార్గపు సర్కతాను ఎదురించి గెల‌వాల‌ని బ‌య‌ల్దేరాక ఏం జ‌రిగిందో తెర‌పై చూపించారు.

స్త్రీ 3లోను శ్ర‌ద్ధా, రాజ్ కుమార్ రావు న‌టిస్తార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే శ్ర‌ద్ధా తాజా చాటింగ్ సెష‌న్ లో మాట్లాడుతూ.. స్త్రీ 3 స్టోరి రెడీ చేస్తున్నార‌ని, ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని తెలిపారు. రెండో భాగం కంటే మ‌రింత వినోదం మూడో భాగంలో ఉంటుంద‌ని కూడా క‌న్ఫామ్ చేసింది. స్త్రీ చూసినపుడు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదనిపించింది. ఇప్పుడు అంత‌కుమించి సీక్వెల్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాన్ని అందించింది. పెద్ద విజ‌యం సంతోషాన్నిచ్చింది. ప్ర‌స్తుతం స్త్రీ 3 ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఇందులో వినోదం పుష్క‌లంగా ఉంటుంది. క‌థ‌తో పాటు, నా పాత్ర కూడా చాలా బాగుంటుంది`` అని శ్రద్ధా చెప్పింది. 2025లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.