Begin typing your search above and press return to search.

అమరన్ బాక్సాఫీస్.. టైర్ 2లో న్యూ రికార్డ్

కోలీవుడ్ సెన్సేషనల్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన సినిమానే ‘అమరన్’.

By:  Tupaki Desk   |   1 Nov 2024 9:57 AM GMT
అమరన్ బాక్సాఫీస్.. టైర్ 2లో న్యూ రికార్డ్
X

సంక్రాంతి, దసరా తర్వాత దీపావళి పండుగకే ఎక్కువగా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ ఏడాది కూడా ఎన్నో రకాల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ‘అమరన్’ అనే చెప్పాలి. కోలీవుడ్ సెన్సేషనల్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన సినిమానే ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో హైప్ పెరిగింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న విడుదల చేశారు. ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ‘అమరన్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూలమైన టాక్ వచ్చింది. దీంతో ఊహకే అందని విధంగా మొదటి రోజు ఈ మూవీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇలా ఇది వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 36 కోట్లు గ్రాస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా శివ కార్తికేయన్ కెరీర్‌లోనే టాప్ మూవీగా ఇది రికార్డును సొంతం చేసుకుంది.

‘అమరన్’ సినిమా ఓపెనింగ్స్‌తోనే శివ కార్తికేయన్ కోలీవుడ్‌లో ఎన్నో మరపురాని రికార్డులను బ్రేక్ చేసుకున్నాడు. అదే సమయంలో సౌతిండియాలో సైతం అతడు కొన్ని ఘనతలను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను (36 కోట్లు) సాధించిన టైర్ 2 హీరోల్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరిట ఉన్న ఖుషి (27 కోట్లు) రికార్డును దాటేశాడు.

దక్షిణ భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకున్న టైర్ 2 హీరోల లిస్టులో నేచురల్ స్టార్ నాని ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు నటించిన ‘దసరా’ చిత్రానికి ఏకంగా రూ. 38 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ లిస్టులోనే నాలుగో స్థానంలో ‘లైగర్’ (25 కోట్లు), ఐదో స్థానంలో ‘రాయన్’ (24.20 కోట్లు), ఆరో స్థానంలో ‘సరిపోదా శనివారం’ (22 కోట్లు) కొనసాగుతున్నాయి. సౌత్ ఇండియా నుంచి పైన పేర్కొన్న ఈ టైర్ 2 హీరోల ఆరు సినిమాలు మాత్రమే రూ. 20 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ ఓపెనింగ్స్‌ను అందుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏ హీరో చిత్రాలు వీటి రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి.