Begin typing your search above and press return to search.

అమరన్ తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఇందులో లవ్ స్టోరీతో పాటు దేశభక్తిని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   26 Dec 2024 7:30 AM GMT
అమరన్ తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా తమిళంలో తెరకెక్కిన ‘అమరన్' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మేజర్ ముకుందన్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది. ఇందులో లవ్ స్టోరీతో పాటు దేశభక్తిని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. శివ కార్తికేయన్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

సాయి పల్లవి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్ లో 250 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల జాబితాలో ‘అమరన్’ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై 5.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు మొదటి ఆటకే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపించారు. ‘అమరన్’ తో పాటు థియేటర్స్ లో ‘లక్కీ భాస్కర్’, ‘క’ సినిమాలు ఒకేసారి సందడి చేశాయి. అనూహ్యంగా ఈ మూడు సినిమాలని ఆడియన్స్ బాగా ఆదరించారు.

‘లక్కీ భాస్కర్’ సినిమాకి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ఇచ్చారు. ఇక క చిత్రానికి 50 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి. 'అమరన్' సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం 50.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో 28 కోట్లు షేర్ ఉండటం విశేషం. అంటే మూవీ లాంగ్ రన్ లో ఏకంగా 22.50 కోట్ల ప్రాఫిట్ ని మేకర్స్ కి అందించింది. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చి అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది.

శివకార్తికేయన్ కి కూడా ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాలలో కొంత మార్కెట్ క్రియేట్ అయ్యింది. అతని గత సినిమాలు కూడా తెలుగులో మోస్తరుగా ప్రేక్షకులని మెప్పించాయి. అయితే ఆయనకి తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ అమరన్ అని చెప్పాలి. ఈ సినిమాతో ఆయన మార్కెట్ రేంజ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం శివ కార్తికేయన్ మురుగదాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.