Begin typing your search above and press return to search.

'అమరన్' క్యాస్ట్ అందుకే రివీల్ చేయలేదు'.. డైరెక్టర్ క్లారిటీ

తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఆ సినిమా పాజిటివ్ టాక్ తో ఓ రేంజ్ లో అలరిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 11:19 AM GMT
అమరన్ క్యాస్ట్ అందుకే రివీల్ చేయలేదు.. డైరెక్టర్ క్లారిటీ
X

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మెయిన్ రోల్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ మూవీ దూసుకుపోతోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఆ సినిమా పాజిటివ్ టాక్ తో ఓ రేంజ్ లో అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన అమరన్.. సెకెండ్ వీక్ లో కూడా సాలిడ్ గా రాణిస్తోంది. లక్కీ భాస్కర్, క చిత్రాలతో పోటీతో ఉన్నా.. దూసుకెళ్తోంది.

2014లో జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌ గా అమరన్‌ ను రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన విషయం తెలిసిందే. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా మూవీ తీశారు. సినిమాలో ముకుంద రాజన్ గా శివ కార్తికేయన్, ఆయన సతీమణి ఇందు రెబెక్కా వర్గీస్‌ గా సాయి పల్లవి యాక్ట్ చేశారు.

అయితే స్టోరీ ప్రకారం సాయి పల్లవి రోల్ ను సినిమాలో క్రిస్టియన్ గా చూపించారు డైరెక్టర్ పెరియస్వామి. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, సంప్రదాయాలు వంటి విషయాలను కూడా క్లియర్ గా చూపించారు. కానీ మేజర్ ముకుంద్ ది ఏ కులమనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీంతో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమిళనాడుకు చెందిన ముకుంద్ కులాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదని మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

ఇప్పుడు ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. తాను అలా కులం గురించి సినిమాలో గోప్యంగా ఉంచడానికి కారణాన్ని వెల్లడించారు. ముకుంద రాజన్ తల్లిదండ్రులు.. కుల ప్రస్తావనే తీసుకురావొద్దని తనకు చెప్పినట్లు తెలిపారు. దేశం కోసం అసువులు బాసిన తమ కుమారుడిని ఒక భారతీయుడిగా, తమిళుడిగా గుర్తించాలని అన్నట్లు చెప్పారు. అందుకే తాను ఈ అంశాన్ని రివీల్ చేయలేదని వెల్లడించారు.

తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి.. కోలీవుడ్ హీరోతోనే ముకుంద్ వరదరాజన్ బయోపిక్ తీయాలని ఆయన సతీమణి ఇందు రెబెక్కా వర్గీస్‌ డైరెక్టర్ పెరియస్వామి కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే శివ కార్తికేయన్ ను హీరోగా ఆయన సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఏదేమైనా శివ కార్తికేయన్ తన రోల్ లో ఒదిగిపోయారు. ఇక సాయి పల్లవి అయితే చెప్పనక్కర్లేదు. తన నటన, ఎమోషన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.