Begin typing your search above and press return to search.

'అమరన్‌' మళ్లీ హిట్‌... సలార్‌, కల్కిని మించి!

శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందిన అమరన్‌ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 5:23 AM GMT
అమరన్‌ మళ్లీ హిట్‌... సలార్‌, కల్కిని మించి!
X

శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందిన అమరన్‌ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకున్న అమరన్‌ సినిమా తాజాగా వరల్డ్‌ టెలివిజన్ ప్రీమిర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.330 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న అమరన్ సినిమాకి తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి స్పందన దక్కింది. శివ కార్తికేయన్‌ ఈ సినిమాతో తమిళనాట స్టార్‌ హీరోల జాబితాలో చేరి పోయారు. సాయి పల్లవి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

థియేట్రికల్‌ రిలీజ్‌తో భారీ వసూళ్లు సాధించిన అమరన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ లోనూ మంచి స్పందన దక్కించుకుంది. ఓటీటీ లో వరుసగా మూడు నాలుగు వారాల పాటు టాప్‌లో ట్రెండ్‌ అయ్యింది. సాయి పల్లవి నటన గురించి, శివ కార్తికేయన్‌ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సినిమాకి వచ్చిన స్పందన అద్భుతం అని చెప్పాలి. థియేట్రికల్‌ రిలీజ్‌, ఓటీటీలో సూపర్‌ హిట్‌ దక్కించుకుని, అత్యధికులు చూసిన నేపథ్యంలో టీవీల్లో ఎక్కువ శాతం మంది చూడక పోవచ్చు అని అంతా భావించారు. కానీ అమరన్ టీవీ స్క్రీన్‌పైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా అమరన్‌ తెలుగు వర్షన్‌ బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. మొదటి టెలికాస్ట్‌ లో ఏకంగా 9.10 రేటింగ్‌ నమోదు చేసింది. ఈమధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలు సైతం ఈ రేంజ్‌లో రేటింగ్‌ సొంతం చేసుకోలేక పోతున్నాయి. అలాంటిది అమరన్‌ సినిమా బుల్లి తెర ద్వారా దుమ్ము రేపింది. ఒక తమిళ్ సినిమా డబ్బింగ్ వర్షన్ తెలుగు లో ఈ స్థాయిలో రేటింగ్ దక్కించుకోవడం ఈమధ్య కాలంలో జరగడం లేదు. పైగా సలార్‌, కల్కి వంటి పెద్ద సినిమాల రేటింగ్‌లను మించి అమరన్‌కి తెలుగు బుల్లి తెరపై వ్యూవర్‌షిప్ దక్కింది.

మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. దేశ భక్తితో పాటు శివ కార్తికేయన్‌, సాయి పల్లవి మధ్య మంచి బాండింగ్‌ను చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సినిమాకు మంచి స్పందన వచ్చింది. బుల్లి తెరపై టెలికాస్ట్‌ అయిన సమయంలోనూ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో ఈ స్థాయిలో రేటింగ్‌ దక్కింది. రాజ్ కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కమల్‌ హాసన్‌ ఒక నిర్మాతగా వ్యవహరించారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.