అమరన్ టీజర్: యుద్ధం చూపిస్తోన్న శివకార్తికేయన్
ప్రస్తుతం శివకార్తికేయన్ కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 17 Feb 2024 5:49 AM GMTకోలీవుడ్ లో శివకార్తికేయన్ అంటే ఎక్కువ క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ, కాస్త యాక్షన్, కాస్తా ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసిన జోనర్ కథలే కనిపిస్తాయి. అలాంటి మూవీస్ తోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని శివకార్తికేయన్ క్రియేట్ చేసుకున్నాడు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు కోలీవుడ్ లో నేచురల్ పెర్ఫార్మెన్స్ తో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం శివకార్తికేయన్ కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ చేస్తున్నాడు. అమరన్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ప్రొడక్షన్ తో పాటు సోనీ పిక్చర్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
టీజర్ చూసుకుంటే కాశ్మీర్ లోని టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో ఉగ్రవాదులతో పోరాటం చేసే ఆర్మీ టీమ్ ని నడిపించే పవర్ ఫుల్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. లుక్ పరంగా శివకార్తికేయన్ గత సినిమాలలో చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉండేవాడు. అయితే ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ కి తగ్గట్లు గా మంచి ఫిజిక్ తో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ ఉండటం విశేషం.
పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించినట్లు టీజర్ లో విజువల్స్ బట్టి స్పష్టం అవుతోంది. శివకార్తికేయన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అమరన్ టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అన్ని భాషలలో ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు పోస్టర్స్ బట్టి తెలుస్తోంది.
సాయి పల్లవి ఈ మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా నటిస్తూ ఉండటం విశేషం. అయితే టీజర్ లో మాత్రం ఎక్కడా సాయి పల్లవిని దర్శకుడు రివీల్ చేయలేదు. శివకార్తికేయన్ బర్త్ డే కావడంతో అతని క్యారెక్టరైజేషన్ మీదనే టీజర్ కట్ చేసి రిలీజ్ చేశారు. రీజన్ తా అయలాన్ మూవీతో శివకార్తికేయన్ ప్రేక్షకుల ముందుకి వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. అమరన్ మూవీ అతని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశం ఉందని టీజర్ బట్టి స్పష్టం అవుతోంది.