Begin typing your search above and press return to search.

'ఏ మాస్టర్ పీస్' టీజర్.. ఎలా ఉందంటే?

తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ పూర్వాజ్ పారాడాక్స్ లో భాగంగా ఫేజ్-1 శివం అని క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:34 PM GMT
ఏ మాస్టర్ పీస్ టీజర్.. ఎలా ఉందంటే?
X

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ మధ్య ధారావాహిక నుంచి బయటకొచ్చేసింది. సినిమాలు, వెబ్ సిరీసుల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకుంది.

ఆ తర్వాత తన పేరును జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. అయితే ఓ సినిమా టైమ్ లో పరిచయమైన జ్యోతి, సుకు ప్రేమలో పడి చేసుకున్నారు. అదే ఏ మాస్టర్ పీస్ మూవీ. సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తన యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ పూర్వాజ్ పారాడాక్స్ లో భాగంగా ఫేజ్-1 శివం అని క్లారిటీ ఇచ్చారు. హిరణ్య కశిపుడు రాక్షస మహారాజు గురించి విన్నారా.. మీ కలలు నిజం కావాలి అంటే.. నిద్రలోకి వచ్చే కలల తగ్గాలి అనే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఉంటాయి.. కానీ మనుషుల మధ్య మహా సంగ్రామం అంటూ హైప్ క్రియేట్ చేశారు.

టీజర్ అంతా రిచ్ విజువల్స్ తో నిండిపోయింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కు ఇంట్రెస్టింగ్ స్టోరీని మేకర్స్ యాడ్ చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది. స్టోరీ లైన్ పై ఇంట్రెస్ట్ కలిగేలా టీజర్ ను కట్ చేశారు మేకర్స్. మంచి ఫాంటసీ ఫిల్మ్ గా ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. పురాణ ఘట్టాలను మెయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

మనీష్ గిలాడా విలన్ గా అదరగొట్టారు. సూపర్ హీరో రోల్ లో అరవింద్ కృష్ణ అద్భుతంగా కనిపిస్తున్నారు. తన యాక్టింగ్ తో మెప్పించేటట్టు ఉన్నారు. హీరోయిన్లు స్నేహ గుప్తా, ఆషురెడ్డితో పాటు కీలక పాత్ర పోషిస్తున్న జ్యోతి పూర్వాజ్ ను కూడా మేకర్స్ పరిచయం చేశారు. మెర్జ్ ఎక్స్‌ ఆర్‌ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై శ్రీకాంత్ కాండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.