Begin typing your search above and press return to search.

చై, సామ్ ఫ్యాన్స్ తో ఆడేసుకుంటున్న అమెజాన్‌!

నాగ చైతన్య 'ధూత' సిరీస్ ను రెండేళ్లుగా హోల్డ్‌ లో పెట్టిన అమెజాన్ వారు సమంత సిటాడెల్‌ సిరీస్ స్ట్రీమింగ్ విషయం లో సస్పెన్స్‌ ను క్రియేట్‌ చేస్తోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:32 AM GMT
చై, సామ్ ఫ్యాన్స్ తో ఆడేసుకుంటున్న అమెజాన్‌!
X

నాగ చైతన్య మరియు సమంత విడిపోయిన తర్వాత ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించారు. సమంత నటించిన వెబ్‌ సిరీస్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నాగ చైతన్య నటించిన 'ధూత' వెబ్ సిరీస్ మాత్రం ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. రెండేళ్లుగా ఈ సిరీస్ గురించి చర్చ జరుగుతోంది.

సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత సిటాడెల్‌ సిరీస్ తో మరోసారి అమెజాన్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ ను ముగించడం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సిటాడెల్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయకుండా అమెజాన్ వాయిదా వేస్తూ వస్తోంది.

నాగ చైతన్య 'ధూత' సిరీస్ ను రెండేళ్లుగా హోల్డ్‌ లో పెట్టిన అమెజాన్ వారు సమంత సిటాడెల్‌ సిరీస్ స్ట్రీమింగ్ విషయం లో సస్పెన్స్‌ ను క్రియేట్‌ చేస్తోంది. ఈ రెండు సిరీస్‌ లను అమెజాన్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించడం జరిగింది. ఆ రెండు సిరీస్ ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయినా కూడా స్ట్రీమింగ్ కు రెడీ అవ్వడం లేదు.

సమంత ప్రస్తుతం విశ్రాంతి లో ఉంది. ఆమె వచ్చిన తర్వాత సిటాడెల్‌ ను స్ట్రీమింగ్‌ చేస్తారేమో అని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నాగ చైతన్య సిరీస్‌ ను ఎప్పటికి స్ట్రీమింగ్ చేస్తారు అనే క్లారిటీ లేదు. దాంతో ఇద్దరి అభిమానులు కూడా అమెజాన్‌ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వారు మాత్రం ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పెట్టి ఆట ఆడేసుకుంటున్నారు.

ఈ సస్పెన్స్ కి 2024 లో అయినా అమెజాన్ తెర దించుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇద్దరి ఫ్యాన్స్ కూడా వారు నటిస్తున్న సినిమాల పై శ్రద్ధ పెట్టారు. సిరీస్‌ ల కోసం వెయిట్‌ చేసి చేసి అలసి పోయినట్లుగా చై మరియు సామ్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్‌ చేస్తున్నారు.