Begin typing your search above and press return to search.

అంబానీ అయినా..అభిమానైనా మేమంతా ఒక్క‌టే!

అంబానీ ఇంట పెళ్లికి డ్రెస్ కోడ్ ని అనుస‌రించి ఎవ‌రి స్టైల్లో వారు అతిధులుగా విచ్చేసారు.

By:  Tupaki Desk   |   15 July 2024 11:17 AM GMT
అంబానీ అయినా..అభిమానైనా మేమంతా ఒక్క‌టే!
X

అంబానీ ఇంట పెళ్లికి డ్రెస్ కోడ్ ని అనుస‌రించి ఎవ‌రి స్టైల్లో వారు అతిధులుగా విచ్చేసారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్..టాలీవుడ్...ఇత‌ర రంగాల‌కు చెందిన వారంతా త‌మకు న‌చ్చిన డిజైన‌ర్ దుస్తుల్లో మెరిసారు. ఒక్కొక్క‌రిది ఒక్కో స్టైల్. ఎవ‌ర్నీ చూసినా క‌ళ్లు చెదరాల్సిందే. ఆ రేంజ్ లో మెరుపులు క‌నిపిం చాయి మూడు రోజుల ముచ్చ‌ట్లో. అవ‌న్నీ విదేశీ డిజైన‌ర్లు...దేశీయ డిజైన‌ర్లు రూపొందించిన దుస్తులు.

కానీ ఆ ఒక్క రాష్ట్రానికి చెందిన న‌టులు మాత్రం తామంతా ఒక్క‌టే అని ఐక్య‌త చాటారు. వారే కోలీవుడ్ న‌టులు. ఈ వేడుక‌కు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్... అత‌ని అల్లుడు.. హీరో సూర్య‌దంప‌తులు...అట్లీ దంప‌తులు..న‌య‌న‌తార దంప‌తులు కూడా అతిధులుగా హాజ‌ర‌య్యారు. మ‌రి ఈ హీరోలంతా ఎలాంటి దుస్తుల్లో హాజ‌ర‌య్యారో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంద‌రూ అంద‌మైన తెల్ల పంచె..తెలుపు ష‌ర్ట్ ధ‌రించి త‌మిళ సంప్ర‌దాయం ఒట్టి ప‌డేలా చేసారు.

పెళ్లికి ఇలా హాజ‌ర‌వ్వ‌డం అన్న‌ది త‌మిళ సంప్ర‌దాయం. అక్క‌డి హీరోలంతా ఎలాంటి పెళ్లి వేడుక‌కు వెళ్లినా త‌ప్ప‌కుండా పంచె..లుంగీలోనే హాజ‌ర‌వుతారు. అభిమానులు పెళ్లిళ్ల సంద‌ర్భంలో త‌ల‌ప‌తి విజ‌య్... కార్తీ...విశాల్..ధ‌నుష్‌...సూర్య ఎన్నోసార్లు ఇదే దుస్తుల్లో క‌నిపించారు. ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లై అయినా మాకు ఒక్క‌టే అంటూ ర‌జ‌నీ, సూర్య‌, అట్లీ, విగ్నేష్ శివ‌న్ పంచె...లుంగీతో ద‌ర్శ‌న‌మివ్వ‌డం వేడుక మొత్తానికి సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచింది.

పైజ‌మా... కుర్తా...శ‌ర్వాణీ లాంటి దుస్తులు అంద‌రూ వేసుకుంటారు. పంచె..లుంగీ అన్న‌ది అక్క‌డ యూనిక్ స్టైల్ గా హైలైట్ అయింది. ఆ వేడుక‌లో ర‌జ‌నీకాంత్ కూడా డాన్సు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సినిమాల్లో కెమెరా ముందు త‌ప్ప ఇంకెక్క‌డా? ఎలాంటి డాన్సులు చేయ‌రు. ఎంతో నిరాడం బ‌రంగా ఉంటారు. ఇలా అంబానీ ఇంట ఆడ‌టం నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటుంది.