Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: అంబానీ కొడుకు పెళ్లి ఖ‌ర్చు జ‌స్ట్ ఇంతేనా?

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల జాబితాలో అంబానీ పేరు ఎప్పుడూ అగ్ర‌ప‌థం(టాప్ 20) లో ఉంటుంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 8:07 AM GMT
ట్రెండీ టాక్: అంబానీ కొడుకు పెళ్లి ఖ‌ర్చు జ‌స్ట్ ఇంతేనా?
X

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల జాబితాలో అంబానీ పేరు ఎప్పుడూ అగ్ర‌ప‌థం(టాప్ 20) లో ఉంటుంది. ఆసియాలో అత్యంత ధ‌నికుడిగా రాజ్య‌మేలుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 9.36 ల‌క్ష‌ల కోట్లు (112.18 బిలియ‌న్ల‌ అమెరిక‌న్ డాల‌ర్లు). గ‌త ఏడాది గౌత‌మ్ అదానీ కంటే వెన‌క‌బ‌డిన ముఖేష్ అంబానీ ఈ ఏడాది అత‌డిని అధిగ‌మించార‌ని ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ త‌న‌ క‌థ‌నంలో ప్ర‌క‌టించింది.

అయితే అంత గొప్ప ధ‌న‌వంతుడి ఇంట పెళ్లి జ‌రుగుతోంది అంటే దానిని 'దుబారా' అన‌గ‌ల‌మా? కానీ ఇటీవ‌లి కాలంలో అంబానీల ఇంట పెళ్లి ఖ‌ర్చు గురించి చాలా నెగెటివ్ కామెంట్లు వెబ్ లో చూస్తున్నాం. ముఖేష్ అంబానీ త‌న చిన్న కుమారుడు (రెండోవాడు) అయిన అనంత్ అంబానీ వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్ర‌పంచ కుబేరుడు చేయ‌లేనంత ఘ‌నంగా చేస్తున్నాడు. దీనికోసం ఏకంగా రూ. 3000 కోట్లు పైగా ఖ‌ర్చు చేస్తుండ‌డంతో ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అనంత్ అంబానీ మొద‌టి ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌ ఖ‌ర్చు 1000కోట్లు. గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్ లో ఇప్ప‌టికే ఈ వేడుక‌లు ముగిసాయి. త‌దుప‌రి అంబానీ రెండవ ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌ ఖ‌ర్చు 1000 కోట్లు. ప్ర‌స్తుతం యూర‌ప్ లో విలాస‌వంత‌మైన‌ క్రూయిజ్ షిప్ లో ఈ వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. దీనికోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ 800 మంది అతిథులు విచ్చేసారు. ఒక ఖ‌రీదైన‌ విలేజ్ ని త‌ల‌పించేలా ఉన్న భారీ క్రూయిజ్ షిప్‌లో ఈ ప్రీవెడ్డింగ్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈ షిప్‌లోనికి అతిథుల‌ను దించేందుకు ఖ‌రీదైన కార్లు, బ‌స్సులు ప్ర‌యాణిస్తున్నాయంటే దీని రేంజ్ ను అర్థం చేసుకోవ‌చ్చు. వంద టైటానిక్ షిప్‌ల‌కు మించిన రాజ‌సం ఈ క్రూయిజ్ షిప్ లో క‌నిపిస్తోంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్రీపెళ్లిల్లు కేవ‌లం కొస‌రు మాత్ర‌మే.. అస‌లు పెళ్లి ముందుంది!! ఈ పెళ్లి కోసం మ‌రో 1000 కోట్లు లేదా అంత‌కుమించి అంబానీ ఖ‌ర్చు చేస్తాడ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. ముంబై జియోవ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి కోసం ఇప్ప‌టికే భారీ ఏర్పాట్లు సాగుతున్నాయని క‌థ‌నాలొస్తున్నాయి. జూలైలో జ‌ర‌గ‌నున్న‌ అనంత్ అంబానీ అస‌లు పెళ్లికి ఖ‌ర్చు 1000 కోట్లు పైగా ఉంటుంద‌ని అంచ‌నా.. అయితే 113 బిలియ‌న్ల ఆస్తులున్న అంబానీకి ఇది ఒక లెక్కా.. 0.0001 శాతం కూడా పెళ్లికి ఖ‌ర్చు పెట్ట‌లేదేమిటీ! అంటూ కొంద‌రు రివ‌ర్స్ పంచ్ లు వేస్తున్నారు. ఆసియా(భార‌త్‌)లో నంబ‌ర్ 1 ధ‌న‌వంతుడు, ప్ర‌పంచంలోనే 11వ ధ‌న‌వంతుడైన ముఖేష్ అంబానీ ప్ర‌స్తుతం కొడుకు పెళ్లి ప‌నుల‌తో ఫుల్ బిజీ. అత‌డిని విమ‌ర్శిస్తున్న వాళ్లంతా క‌చ్ఛితంగా 'బిజీ' అన్న ప‌దానికి మీనింగ్ తెలియ‌ని ఏ ప‌నీ లేని వాళ్లేన‌ని కొంద‌రు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నించాలి.