Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట వేడుక‌లో అంతా బీబ‌ర్ మ‌యం!

అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ వివాహం సంద‌ర్భంగా ముందొస్తు వేడుక‌ల్లో పాప్ సంచ‌ల‌నం జ‌స్టిన్ బీబ‌ర్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 July 2024 5:44 AM GMT
అంబానీ ఇంట వేడుక‌లో అంతా బీబ‌ర్ మ‌యం!
X

అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ వివాహం సంద‌ర్భంగా ముందొస్తు వేడుక‌ల్లో పాప్ సంచ‌ల‌నం జ‌స్టిన్ బీబ‌ర్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి రోజున సంగీత్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో బీబ‌ర్ త‌న పాప్ సింగింగ్ తో అద‌ర‌గొట్టేసాడు. ముందుగా బేబి సాంగ్ తో ప్ర‌ద‌ర్శ‌న మొద‌లు పెట్టాడు. అటుపై మ‌రికొన్ని పాట‌లు పాడి అతిధుల్ని అల‌రించాడు. సంగీత్ వేడుక‌లో వ‌చ్చిన అతిధులంగా బీబ‌ర్లుగా మారిపోయారు.

ఆయ‌న‌తో పాటు క‌లిసి స్టెప్పులు అందుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెల‌బ్రిటీలైతే బేబ‌ర్ పెర్పార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. వేడుక ఓ రేంజ్ లో సాగింది. బీబ‌ర్ మైక్ అందుకుని పాట‌లు పాడుతూ డాన్సులు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ స్పాట్ లైట్ న‌డుమ ఓ ఊపు ఊపేసాడు. నెత్తిన హ్యాట్.. బ‌నియ‌న్..ప్యాంట్ మాత్ర‌మే ధ‌రించాడు. చొక్కా విప్పేసి పాప్ సింగ‌ర్ స‌త్తా చాటాడు. ఈ సెల‌బ్రేష‌న్స్ లో చాలా మంది పాల్గొన్నారు.

భారీ ఎత్తున జ‌నాలు హాజ‌రైన‌ట్లు వీడియో లో తెలుస్తోంది. పేరుకే సంగీత్ కార్యక్ర‌మంగానీ..షోలో బీబ‌ర్ ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాడు. ఈ షోకు భారీ ఎత్తున ఛార్జ్ చేసాడు. కోట్లాది రూపాయాలు పారితోషికంగా తీసుకున్నాడు. జులై 12న వివాహం జ‌ర‌గ‌నుంది. ఆ వేడుక‌కు జ‌రిగే అన్ని వేడుక‌ల్లోనూ బీబ‌ర్ షో ఉంటుంద‌ని తెలుస్తోంది. సంగీత్ ముగిసిన నేప‌థ్యంలో హ‌ల్దీ వేడుక‌లో పాప్ సింగ‌ర్ ఉర్రూత‌లూగిస్తాడు.

కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకుడు. కోట్లాది మంది అభిమానులున్న పాప్ గాయ‌కుడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే ఎన్నో వేదిక‌ల‌పై షోలు చేసాడు. మై వరల్డ్, అండర్ ది మిసిల్‌టో, బిలీవ్, పర్పస్, ఛేంజెస్, జస్టిస్ లాంటి ఆల్బమ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు.