Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌ని పెళ్లాడి పిల్ల‌ల్ని క‌నాల‌ని క‌ల‌లు కంటోంది

తాజాగా సల్మాన్ ఖాన్‌తో తన వివాహం గురించి అభిమానుల ఆసక్తిని గ‌మ‌నించిన‌ అమీషా పటేల్ దీనిపై చాలా ఫ‌న్నీగా స్పందించింది.

By:  Tupaki Desk   |   30 Jan 2025 6:07 AM GMT
స‌ల్మాన్‌ని పెళ్లాడి పిల్ల‌ల్ని క‌నాల‌ని క‌ల‌లు కంటోంది
X

స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా మ‌గువ‌ల హృద‌యాల్లో గిలిగింత‌లు పెడుతూనే ఉన్నాడు. లేటు వ‌య‌సులోను అత‌డికి ప్ర‌పోజ్ చేయ‌డానికి చాలా మంది వేచి చూస్తున్నారు. కోస్టార్స్ లో ప‌లువురు క‌థానాయిక‌లు అత‌డికి ప్ర‌పోజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్‌తో తన వివాహం గురించి అభిమానుల ఆసక్తిని గ‌మ‌నించిన‌ అమీషా పటేల్ దీనిపై చాలా ఫ‌న్నీగా స్పందించింది. ''మీ ఇద్దరూ బ్యాచిలర్లు ..స‌ల్మాన్ చాలా అంద‌గాడు. అర్హుడు. మీరు చాలా అందంగా ఉన్నారు. దయచేసి మంచిగా కనిపించే పిల్లలను కనడానికి వివాహం చేసుకోండి!`` అని అభిమానులు అమీషాకు సూచించారు. అభిమానుల ఆసక్తి చూశాక‌ అమీషా పటేల్ న‌వ్వుతూ స్పందించింది.

''వావ్ అనిపించింది... ఇది చాలా గొప్ప కాజ్.. అందమైన వ్యక్తులు కలిసి జీవించ‌టాన్ని ప్రపంచం ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను. కహో నా ప్యార్ హై తర్వాత నేను- హృతిక్ కలిసి జీవించాలని అభిమానులు కోరుకున్నారు. హృతిక్ పెళ్లి గురించి ప్రకటించినప్పుడు వారికి హార్ట్ బ్రేక‌యింది. అలా జరగకూడదు అని అన్నారు'' అని అమీషా వ్యాఖ్యానించింది. గ‌త ఏడాది కూడా అమీషా, స‌ల్మాన్ అవివాహితులుగా ఉండటంపై ఒక అభిమాని ఎగతాళిగా మాట్లాడాడు. మీరు పెళ్లి చేసుకునే వీలుందా? అని ప్ర‌శ్నించాడు. దీనికి చాలా స‌ర‌దాగానే స్పందించింది అమీషా.. స‌ల్మాన్ తో పెళ్లి అయినా ప్రాజెక్ట్ అయినా సిద్ధంగా ఉన్నాన‌ని అమీషా అంది. పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నానని, కానీ వరుడు దొరకలేదని కూడా అమీషా ప‌టేల్ వెల్లడించింది.

అమీషా ప‌టేల్ న‌టించిన `గ‌ద‌ర్ 2` గత ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. స‌న్నీడియోల్, అమీషాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. త‌దుప‌రి స‌ల్మాన్ సికంద‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈద్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. అమీషా తదుపరి `రన్ భోలా రన్` చిత్రంలో కనిపిస్తుంది. ఏడాది చివ‌రిలో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.