Begin typing your search above and press return to search.

'బ‌ద్రి' బ్యూటీ అన్‌లిమిటెడ్ ట్రీట్

48 ఏళ్ల వయస్సులో కూడా ఇంత ఫిట్‌గా, టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసినందుకు అభిమానులు అమీషాను ప్రశంసిస్తున్నారు

By:  Tupaki Desk   |   25 May 2024 3:50 AM GMT
బ‌ద్రి బ్యూటీ అన్‌లిమిటెడ్ ట్రీట్
X

బ‌ద్రి (తెలుగు) , కహో నా ప్యార్ హై, గదర్: ఏక్ ప్రేమ్ కథా వంటి హిట్ చిత్రాలలో తన అద్భుత న‌ట‌న‌తో పాపుల‌రైన బాలీవుడ్ నటి అమీషా పటేల్ మరోసారి హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈసారి తన అద్భుతమైన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో అమీషా చెకర్డ్ బికినీలో ఉన్న త‌న‌ అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేసింది.

48 ఏళ్ల వయస్సులో కూడా ఇంత ఫిట్‌గా, టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసినందుకు అభిమానులు అమీషాను ప్రశంసిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ప‌రిస‌రాల్లో తీసిన ఫోటోలు, బికినీతో చెల‌రేగుతున్న‌వి.. జుట్టు స్వేచ్ఛగా వ‌దిలేసి హావ‌భావాలు ప‌లికించ‌డం వ‌గైరా చాలా విషయాలున్నాయి. దీనికి 'వేసవి కాలం' అని క్యాప్షన్ ఇచ్చింది. అమీషా పటేల్ పింక్ కలర్ గ్లామ్ మేకప్ లుక్ లో అద‌ర‌గొట్టింది. అమీషా పటేల్ బికినీ ఫోటోలు సోషల్ మీడియా లలో వేగంగా వైరల్ అయ్యాయి. నేటిత‌రం నటీమణులకు గట్టి పోటీ ఇస్తోందని అమీషాపై కొందరు వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌లో అమీషా పటేల్ ప్రయాణం 2000లో బ్లాక్‌బస్టర్ చిత్రం కహో నా … ప్యార్ హైతో ప్రారంభమైంది. ఉత్తమ ఆరంగేట్ర క‌థానాయిక‌గా జీ సినీ అవార్డును గెలుచుకుంది. బద్రి , గదర్: ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలతో వ‌రుస విజ‌యాలు అందుకుంది. త‌న నటనకు ప్రశంసలు అందుకుంది. తన కెరీర్‌లో వరుస హెచ్చు తగ్గుల తర్వాత, అమీషా హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ - భూల్ భులయ్యా 3 వంటి చిత్రాలలో సహాయక పాత్రలను పోషించింది. ఫ్లాపులు ఎదురైనా గ‌ద‌ర్ 2తో తిరిగి విజ‌యం అందుకుంది. కెరీర్ మ్యాట‌ర్ అటుంచితే.. అమీషా ప్లానెట్ రీడ్ వంటి NGOలలో చేరింది. సినిమా పాటల ద్వారా గ్రామాలలోని ప్రజలకు చదవడం నేర్చుకోవడంలో సహాయం చేసింది.భారతదేశంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC)తో కలిసి పని చేసింది.