Begin typing your search above and press return to search.

అమెరికాలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు మృతి

పోటీలో చివ‌రి ద‌శ వ‌ర‌కూ అత‌డు అద్భుతమైన హాస్యంతో అహూతుల‌ను అల‌రించాడు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:38 AM GMT
అమెరికాలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు మృతి
X

అమెరికాలో భారతీయుల‌ నిరంత‌రం మ‌ర‌ణ వార్త‌లు వినాల్సి వ‌స్తోంది. ఇప్పుడు ప్ర‌ముఖ స్టాండ్ అప్ క‌మెడియ‌న్ క‌బీర్ సింగ్ 39 వ‌య‌సులో మృతి చెందాడు. అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం ఇంకా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

క‌బీర్ సింగ్ అమెరికాస్ గాట్ ట్యాలెంట్ ఫైన‌లిస్ట్. పోటీలో చివ‌రి ద‌శ వ‌ర‌కూ అత‌డు అద్భుతమైన హాస్యంతో అహూతుల‌ను అల‌రించాడు. క‌బీర్ సింగ్ ని 'క‌బీజీ' అని ముద్దు పేరుతో పిలుచుకుంటారు అభిమానులు. స్టాండ్ అప్ క‌మెడియ‌న్ గా 2021 అమెరికాస్ గాట్ టాలెంట్ పోటీదారు గా ఉన్న అత‌డు త‌న‌దైన ప‌రిహాసం అద్భుత‌ హాస్యంతో 'ఫ్యామిలీ గ‌య్' షోలో చిరస్మరణీయ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో శాశ్వ‌త ప్ర‌భావాన్ని చూపించాడు.

కబీర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడ‌ని ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మ్యాగ‌జైన్ పేర్కొంది. మ‌ర‌ణానికి కారణాన్ని గుర్తించేందుకు టాక్సికాలజీ నిపుణులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. ఈ మ‌ర‌ణ వార్త‌ను డిసెంబర్ 5న సింగ్ స్నేహితుడు, జెరెమీ కర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అతడు నిద్రలో ప్రశాంతంగా మరణించాడ‌ని చెప్పాడు. ద‌య‌చేసి అత‌డి కుటుంబం కోసం స్మ‌రించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బ్రో అని జెరోమీ కర్రీ సోష‌ల్ మీడియాల్లో ఆవేద‌న‌గా రాశాడు. కర్రీ అందించిన వివ‌రాల ప్రకారం.. సింగ్ అంత్యక్రియలు డిసెంబర్ 14న హేవార్డ్‌లో జరుగుతాయి.

అమెరికాస్ గాట్ టాలెంట్ కూడా ఎక్స్- ఖాతాలో హాస్యనటుడు క‌బీజీ మృతికి సంతాపం తెలిపింది. త‌న అద్భుత హాస్యంతో అల‌రించిన మేటి ప్ర‌తిభావంతుడైన హాస్యనటుడు కబీర్ సింగ్ మరణం గురించి విని AGT కుటుంబం చాలా విచారంగా ఉంది. అతడు చాలా మందికి ఆనందాన్ని నవ్వును అందించాడు. అద్భుత ప్రతిభావంతుడిని కోల్పోయామ‌ని క్యాప్ష‌న్‌లో రాసారు. క‌బీజీ 2021 2021లో అమెరికాస్ గాట్ టాలెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన అతను ముంబైలో కొంతకాలం గడిపాడు. అత‌డు 2014లో తన స్టాండ్ అప్ కామెడీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కామెడీ సెంట్రల్‌లో ఆరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ప్రతిష్టాత్మకమైన శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ హాస్య న‌టుల పోటీలో ట్రోఫీని గెలుచుకున్నాడు. క‌బీజీ ప్ర‌స్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నాడు.