బ్లాక్ ఫ్రాక్‌లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
తాజాగా తమన్నా ప్రఖ్యాత ఎల్లే కవర్ పేజీ కోసం ఇచ్చిన ఒక ఫోజ్ ఇన్ స్టాలో షేర్ అయింది.
By: Tupaki Desk | 8 Dec 2023 11:30 PM GMTతమన్నా భాటియా పేరు ఇటీవల నిరంతర వార్తల్లో నిలుస్తోంది. ఈ బ్యూటీ ప్రేమాయణంతో పాటు, తన ఫ్యాషన్ ఎంపికలలో ప్రత్యేక శైలితోను వార్తల్లోకొస్తోంది. మిల్కీ సమకాలీన ఫ్యాషన్ పోకడలు నేటితరానికి స్ఫూర్తి. రాహుల్ మిశ్రా హోస్ట్ చేసిన లంచ్ ఈవెంట్‌లో ఇటీవల తమన్నా కనిపించింది. ఈ ఈవెంట్ నుంచి తమన్నా తన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది.
తాజాగా తమన్నా ప్రఖ్యాత ఎల్లే కవర్ పేజీ కోసం ఇచ్చిన ఒక ఫోజ్ ఇన్ స్టాలో షేర్ అయింది. తమన్నా హాఫ్ షోల్డర్ బ్లాక్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. మిల్కీ వైట్ బ్యూటీకి బ్లాక్ డ్రెస్ ఎంతగా అందం పెంచుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
వృత్తిపరంగా చూస్తే..తమన్నా అద్భుతమైన సినిమాల్లో నటిస్తోంది. తమ్మన్నా భాటియా హార్రర్ డ్రామా అరణ్మనై 4లో కనిపించనుంది. దర్శకుడు నిఖిల్ అద్వాణీ `వేదా`లో కూడా కనిపిస్తుంది. తన తదుపరి చిత్రంలో జాన్ అబ్రహం సరసన నటించనుంది. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖీ- రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్‌లతో కలిసి దర్శకుడు షామస్ నవాబ్ తెరకెక్కిస్తున్న హాస్య చిత్రం `బోలే చుడియాన్`లో నటిస్తోంది. తమన్నా భాటియా - విజయ్ వర్మ జంట ఇటీవల ఓటీటీ సిరీస్ తో అలరించారు. ఇకపై పెద్ద తెరపైనా కలిసి నటించాలని ఆరాటపడుతున్నారు.
ఎల్లే రాశి ఫలాలు:
#ELLE సోషల్ మీడియాలో తమన్నా ఫోటోని షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని ప్రచురించింది. నేటి మార్గదర్శకాన్ని చదివి సేవ్ చేయండి. డిసెంబరులో ఒక్కో రాశి ఫలాన్ని చూపించే మొత్తం చిత్రం ఇది. ప్రతిఒక్కరూ రాశి ఫలాల్ని తెలుసుకోండి. అయినప్పటికీ అవి కొన్ని కఠినమైన వాస్తవాలతో వస్తాయి. ఈ వారం అందమైన పౌర్ణమితో ప్రారంభమవుతుంది. వేగాన్ని తగ్గించండి అనే సందేశం ఇస్తుంది. హస్టిల్ నుండి విడిపోండి. గతాన్ని, దుఃఖాన్ని మీరు వేలాడుతున్న ఏదైనా ఉద్వేగాన్ని వదిలేయండి. ఈ వారం సరెండర్ ని ప్రాక్టీస్ చేయండి. డిసెంబరు వరకు అది మీ మోడ్‌గా ఉండనివ్వండి. ఈ సంవత్సరంలో సాధించిన లేదా సృష్టించిన వాటిని సెలబ్రేట్ చేసుకోండి. 2024లో మిమ్మల్ని మీరు సెటప్ చేసుకోవడానికి రీకాలిబ్రేట్ చేసుకోండి. డిసెంబరును మరింత గొప్పగా పరిగణించండి.. అని వ్యాఖ్యానాన్ని అందించింది.