అమీర్ డాటర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లు షురూ!
మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్- నూపుర్ శేఖరే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్లు మొదలై పోయాయి.
By: Tupaki Desk | 4 Nov 2023 6:47 AM GMTమిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్- నూపుర్ శేఖరే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్లు మొదలై పోయాయి. పెళ్లికి ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నా! ప్రీవెడ్డింగ్ లో తగ్గేదేలే అంటూ ముందుగానే వేడుకలు షురు చేసారు. ముంబైలో నిన్నటి రోజున కెల్వన్ వేడుకను నిర్వహించారు. కాబోయే వరుడు ముహరాష్ట్ర ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది.
కెల్విన్ వేడుక అంటే? వధువరూల కుటుంబాలు పెళ్లికి ముందు వాళ్ల సంప్రదాయం ప్రకారం ఒకరింటి కొకరు భోజనాలకు ఆహ్వానించుకోవడం. రుచికరమైన భోజనంతో పాటు బహుమతులు ఇచ్చుకోవడం వంటి కార్యక్రమం. ఇది నూపుర్ ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది. అంటే మన భాషలో ఎంగేజ్ మెంట్ తంతులా కనిపిస్తుంది. కెల్వన్ పంక్షన్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐరాఖాన్ అందమైన గులాబీ వర్ణం లహరియా డిజైన్ చీరను ధరించింది. నూపుర్ సాధారణ దుస్తుల్లోనే ఉన్నాడు. కాబోయే జోడీ ఇద్దరు నిన్నటి రోజున బంధు వర్గంతో సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఇంట్లో చుట్టాల హడావుడి కనిపిస్తోంది. ఐరాఖాన్ తల్లి రీనా దత్తా.. నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖారే సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
అలాగై ఐరాఖాన్ స్నేహితురాలి మిథిలా పాల్కర్ కూడా ఉంది. ఇక ఈ జోడీ వివాహం జనవరి 3న చట్టపరంగా కోర్టు వివాహం చేసుకుంటున్నారు. అటుపై ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసారు. ఆ తర్వాత జనవరి 13న ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కిసంబంధించిన సెలబ్రిటీలతో పాటు.. రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే అమీర్ అమీర్ కి టాలీవుడ్ ప్రముఖులతో మంచి పరిచయా లున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి వారిని పెళ్లికి ఆహ్వానించే అవకాశం ఉంది.