అమీర్ ఖాన్‌తో ఫాతిమా సనా షేక్ బ్రేకప్?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా పెళ్లి వేడుక హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jan 2024 5:30 PM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా పెళ్లి వేడుక హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇరా ఖాన్ - నుపుర్ శిఖరే ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సాంప్రదాయ వేడుకలో పాల్గొంటున్నారు. వివాహానికి కేవలం కొద్దిమంది బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. అయితే ఈ పెళ్లిలో అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు పాల్గొనగా అమీర్ ప్రస్తుత స్నేహితురాలు ఫాతిమా సనా షేక్ హాజరుకాకపోవడం ఆశ్చర్యపరిచింది.
ఫాతిమా సనా షేక్‌ను పెళ్లికి పిలవకపోవడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ముంబయిలో జరిగిన ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు కూడా ఫాతిమా రాలేదు. ఇటీవలే ఇలా పెళ్లి అయింది. ఈ జంట కోసం అమీర్ ఖాన్ మరో స్టార్ రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి రాకపోయినా కానీ ముంబైలో జరిగిన నూపుర్ శిఖరే, ఇరా ఖాన్‌ల నిశ్చితార్థానికి ఫాతిమా సనా షేక్ వచ్చారు. ఇరా పుట్టినరోజుకు కూడా ఫాతిమా హాజరయ్యారు. కానీ ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఫాతిమా ఎందుకు రాలేదు? అని ప్రజలు సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు.
ఇరా ఖాన్ - ఫాతిమా సనా షేక్ మధ్య ఏవైనా అపార్థాలేర్పడ్డాయా? ఏం తప్పు జరిగిందో! అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇరాకు ఫాతిమా మంచి స్నేహితురాలు. కానీ ఇరువురి మధ్య గ్యాప్ ఏదైనా వచ్చిందా అని ప్రజలు సందేహిస్తున్నారు. అయితే ఫాతిమా సనా షేక్ ఈ పెళ్లికి హాజరైతే ఉత్పన్నమయ్యే విమర్శలను అమీర్ ఖాన్ దృష్టిలో పెట్టుకుని తనను రాకుండా వారించారని కూడా కొందరు భావిస్తున్నారు. కుమార్తె ఇరా పెళ్లిలో నాటకీయతను అమీర్ కోరుకోలేదు. అందుకే దీనిని గౌరవిస్తూ ఫాతిమా వేడుకకు రాలేదు అని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.
గతంలో అమీర్ తో డేటింగ్ వ్యవహారంపై సోషల్ మీడియా ట్రోలింగ్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఫాతిమా వాపోయింది. ఇలాంటి ట్రోలింగ్ జరుగుతుందని తాను ఊహించలేదని చెప్పింది. ఈ తరహా నిరాధారమైన గాసిప్‌ల ఆధారంగా ప్రజలు తన క్యారెక్టర్ ని అంచనా వేస్తున్నారని ఫాతిమా అన్నారు. ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరైనా తనను నేరుగా అడగాలని కోరింది. ఇలాంటివి నన్ను కలవరపెడతాయి. ఎందుకంటే ప్రజలు తప్పుగా భావించడం నాకు ఇష్టం లేదు. కానీ నేను దానిని విస్మరించడం నేర్చుకున్నాను. కానీ కొన్నిసార్లు ప్రభావితమయ్యాను.. అని తెలిపింది.