అల్లుడి బాధ్యతలు మేనమామ తీసుకున్నాడా?
అయితే అతడి కంబ్యాక్ బాధ్యతలు మేనమామ అమీర్ ఖాన్ తీసుకోవడం వివేషం. ఇమ్రాన్ ఖాన్ హీరోగా అమీర్ ఖాన్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది.
By: Tupaki Desk | 30 April 2024 10:30 AM GMTట్యాలెండెట్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. అమీర్ ఖాన్ మేనల్లుడి గా ఇమ్రాన్ ఎంతో ఫేమస్. చేసింది కొన్నిసినిమాలే అయినా తనదైన బ్రాండ్ వేసిన నటుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు. 'జానే తూ యా జానే నా' ..'కిడ్నాప్'..'లక్'..'ఢిల్లీబెల్లి' లాంటి ఎన్నో విజయాలు అందుకున్నాడు. నటుడిగా ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తన బ్రాండ్ తో దూసుకుపోయాడు. అయితే 'కట్టీబట్టీ' ప్లాప్ తర్వాత ఇమ్రాన్ ఒక్కసారిగా పరిశ్రమకి దూరమయ్యాడు. 2015 లో ఆసినిమా రిలీజ్ అయింది.
అప్పటి నుంచి ఇమ్రాన్ మళ్లీ మ్యాకప్ వేసుకోలేదు. ఇదే సమయంలో భార్యతో విబేధాలు కూడా తలెత్తాయి. దీంతో విడాకులతో ఆ బంధానికి స్వస్తి పలికాడు. మళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇమ్రాన్ ఖాన్ నటుడిగా కంబ్యాక్ అవుతున్నాడు.
అయితే అతడి కంబ్యాక్ బాధ్యతలు మేనమామ అమీర్ ఖాన్ తీసుకోవడం వివేషం. ఇమ్రాన్ ఖాన్ హీరోగా అమీర్ ఖాన్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో స్టాండప్ కమెడియన్ , నటుడు వీర్ దాస్ దర్శకుడిగా పరిచయమ వుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లోనే నిర్మిస్తున్నారు.
'హ్యారీ పటేల్' అనేది సినిమా టైటిల్. ఇదొక కామెడీ ఎంటర్ టైనర్. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ చేతిలో ఉన్నది ఈ ఒక్క చిత్రమే. ఇకపై కంటున్యూగా సినిమాలు చేసే అవకాశం ఉంది. కెరీర్ పీక్స్ లో ఉండగా ఇమ్రాన్ సినిమాలకు దూరమవ్వడం అతడికి అతి పెద్ద మైనస్. లేదంటే ఇమ్రాన్ ఇప్పటికే పెద్ద హీరో అయ్యేవాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కాంపిటీషన్ కూడా తీవ్రంగానే ఉంది. అక్కడి నటులు మార్కెట్ ని విస్తరించుకోవడం కోసం ఇతర భాషల్లో సైతం సినిమాలు చేస్తోన్న తరుణమిది.
ఇలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ కంబ్యాక్ అయ్యాడు. దీంతో వాళ్లతో పాటు ఇమ్రాన్ అంతే అప్డేడేట్ గా సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్నపోటీని తట్టుకుని ముందుకెళ్తే తప్ప మార్కెట్ లో నిలబడటం కష్టం. బ్యాకెండ్ లో మేనమామ సూచనలు ..సలహాలు ఉంటాయి కాబట్టి పర్వాలేదు. పికప్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం ఇమ్రాన్ పైనే ఉంది.