Begin typing your search above and press return to search.

బచ్చన్‌ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. ఈ ఫాలో, అన్‌ ఫాలో ఏంటి?

ఇదే సమయంలో కొందరు మాత్రం అమితాబచ్చన్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫాలో అవుతున్న వారిని హైడ్‌ చేసి గోప్యంగా ఉంచుతున్నాడు

By:  Tupaki Desk   |   9 Dec 2023 8:01 AM GMT
బచ్చన్‌ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. ఈ ఫాలో, అన్‌ ఫాలో ఏంటి?
X

బాలీవుడ్‌ మీడియాతో పాటు సౌత్‌ మీడియాలో కూడా ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్‌ బచ్చన్‌ ల వైవాహిక బంధం మరియు గొడవల గురించి ప్రధానంగా చర్చలు జరుగుతూ, కథనాలు వస్తూనే ఉంటాయి. అభిషేక్‌ బచ్చన్‌ నుంచి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ విడిపోయింది.. లేదంటే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు రావడం మనం చూశాం.

అమితాబచ్చన్‌ దంపతులను కూడా ఈ వివాదంలోకి చాలా సార్లు లాగిన సందర్భాలు ఉన్నాయి. జయా బచ్చన్‌ కి, ఐశ్వర్య రాయ్‌ కి మధ్య విభేదాలు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి ఎప్పటికప్పుడు ఆ ఫ్యామిలీ గురించి ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా బిగ్‌ బి అన్ ఫాలో అయ్యాడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

ఐశ్వర్య ఇన్ స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను అమితాబచ్చన్ మొన్నటి వరకు ఫాలో అయ్యేవారు.. కానీ ఈ మధ్య ఆయన ఐశ్వర్య రాయ్‌ ని అన్ ఫాలో అయ్యారు అంటూ కొందరు బాలీవుడ్‌ సోషల్‌ మీడియా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను వారు చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు మాత్రం అమితాబచ్చన్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫాలో అవుతున్న వారిని హైడ్‌ చేసి గోప్యంగా ఉంచుతున్నాడు. మీరు ఎలా ఐశ్వర్య రాయ్‌ ని అన్‌ ఫాలో అయ్యాడు అంటూ చెబుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు బచ్చన్‌ సాబ్‌ ఇన్‌ స్టా లో ఎవరిని ఫాలో అవ్వడం లేదని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి బచ్చన్‌ తాజాగా ఐశ్వర్య రాయ్‌ ని అన్‌ ఫాలో అవుతున్నాడు అంటూ ప్రచారం చేస్తూ, బచ్చన్‌ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అంటూ మీడియాలో కథనాలను కొందరు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఆ ఫ్యామిలీ లో విభేదాలు లేవు అనేది కొందరి మాట.

జూనియర్‌ బచ్చన్‌ ని ఐశ్వర్య పెళ్లి చేసుకుని రెండు దశాబ్దాలు కావస్తుంది. వీరికి ఒక పాప ఉంది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాఫీగా సాగుతోంది. కనుక ఇప్పటికి అయినా వారి ఫ్యామిలీకి సంబంధించిన పుకార్లను ఆపేస్తే బెటర్ అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.