రియల్ వైఫ్ పక్కనా నటించిన సూపర్ స్టార్ ఈయన!
బిగ్ బీ అమితాచ్చన్ హోస్ట్ చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 రన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Dec 2024 2:30 AM GMTబిగ్ బీ అమితాచ్చన్ హోస్ట్ చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 రన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో వేదికగా అమితాబ్ తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. మునుపటి కంటే షోని మరింత రక్తి కట్టించడం అమితాబ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. `మా ఇంట్లో బంధువులున్నా..అతిధులు వచ్చినా జయ వారితో బెంగాలీలోనే మాట్లాడుతుంది.
ఆమె చుట్టు ఎవరున్నా సరే వాళ్లను పట్టించుకోకుండా బెంగాలీలో గలగలా మాట్లాడుతుంది. నాకేమో ఆ భాష అర్దం కాదు. కానీ వచ్చినట్లు నటిస్తా. నాకు ఇప్పటికీ బెంగాలీ మాట్లాడటం తెలియదు. కొద్దిగా అర్దమవుతుందంతే. నేను యూపీకి చెందిన బెంగాలీ మహిళను, నా సోదరుడు సింధీ భాష మహిళను, నా కుమార్తె పంజాబీ అబ్బాయిని, నాకుమారుడు కన్నడ అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
అన్ని ప్రాంతాలకు చెందిన వారు మన కుటుంబంలో ఉండాలని నాన్న చెప్పేవారు. ఆయన చెప్పినట్లే అలాగే ఉన్నారు` అని అన్నారు. మొత్తానికి అమితాబ్ తండ్రి కోరిక మాత్రం మనవలు, కోడలు రూపంలో తీరింది. మామ కోరుకోవడం తనయుడు, మనవలు కాదనడమా? అన్నట్లే అమితాబ్ ఇంట్లో వ్యవహారం కనిపిస్తుంది. అలాగే ఇదే షోలో హృతిక్ రోషన్ పైనా అమితాబ్ ప్రశంసలు కురిపించారు.
హృతిక్ రోషన్ తొలి సినిమా రిలీజ్ రోజున స్నేహితులతో కలిసి వెళ్లి చూసానన్నారు. అంతే కాదు అందులో హృతిక్ వేసిన డాన్సు కూడా కాపీ కొట్టినట్లు తెలిపారు. ఇక అమితాబ్ 80 ఏళ్ల వయసులోనే ఇండియాని ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన `కల్కి 2898`లో ఆయన స్టంట్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేరుకు ప్రభాస్ హీరో అయినా రియల్ హీరో మాత్రం అమితాబ్ గానే కనిపించారు.