Begin typing your search above and press return to search.

ఇది సార్ ఆయ‌న రేంజ్..బ్రాండ్!

దీంతో ర‌జ‌నీకాంత్ అమితాబ్ బ్రాండ్ తో ఆడేస్తోంది.బాలీవుడ్ న‌టుల్లో అత్యంత సంప‌న్నుల్లో ఒక‌రు బిగ్ బీ. ఆయన ఆస్తులు 3190 కోట్ల రూపాయలు

By:  Tupaki Desk   |   11 Oct 2024 6:04 AM GMT
ఇది సార్ ఆయ‌న రేంజ్..బ్రాండ్!
X

బాలీవుడ్ లెజెండ‌ర్ అమితాబచ్చ‌న్ జీవితంలో ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తి. ఆయ‌న స్పూర్తితో సినిమా ల్లోకి వ‌చ్చింది మ‌రెంతో మంది. న‌టుడిగా ఆయ‌న సాధించిన విజ‌యాలు అన‌న్య సామ‌న్య‌మైన‌వి. విజ‌యాల‌తో పాటు అవార్డులు..రివార్డులు ఇలా ఎన్నో ఆయ‌న జీవితంలో ఉన్నాయి. 82 ఏళ్ల వ‌యసులోనూ బిగ్ బీ దూకుడు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `క‌ల్కి 2898` సినిమాలో అమితాబ్ యాక్ష‌న స‌న్నివేశాల్లో ఎలా న‌టించారో తెలిసిందే.

30 ఏళ్ల కుర్రాడిలా ఎగిరెగిమ‌రి మరీ ఫైటింగ్ లు చేసారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న గురించి ఇంకొన్ని వివేషాలు.. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌లిసి న‌టించిన `వెట్టేయాన్` కూడా నిన్న‌టి రోజున రిలీజ్ అయింది. డివైడ్ టాక్ తో సినిమా బాగానే ఆడేస్తుంది. `దేవర` రిలీజ్ అయిన రోజులు గ‌డ‌వ‌డంతో వేట్ట‌యానికి ఎలాంటి అడ్డంకి లేదు. దీంతో ర‌జ‌నీకాంత్ ...అమితాబ్ బ్రాండ్ తో ఆడేస్తోంది. ర‌జ‌నీ గురించి చూస్తే...బాలీవుడ్ న‌టుల్లో అత్యంత సంప‌న్నుల్లో ఒక‌రు బిగ్ బీ. ఆయన ఆస్తులు 3190 కోట్ల రూపాయలు.

ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భ‌నాలు ఎన్నో ఉన్నాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక ప్రదేశంలో 31వ అంతస్తులో ఫ్లాట్‌తో సహా ఒక అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. ప్ర‌స్తుతం బిగ్ బీ ఫ్యామిలీతో జుహులో ఉన్న జల్సాలో నివసిస్తున్నారు. దీని ధర 112 కోట్లు. ఇంకా ముంబైలోని చాలా ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. జల్సాలో ఒక తోట, అనేక బెడ్ రూములు కలిగి ఉంది. ఇటీవలే అయోధ్యలో కూడా భూమిని కొనుగోలు చేసారు.

అవార్డులు..రివార్డులు ఆయ‌న సంద‌ప‌ను పెంచుతున్నాయి. ఆయ‌న బ్రాండ్ ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేస్తున్నాయి. ఒక్కో సినిమాకి 6 కోట్ల‌కు పైగానే పారితోషికం తీసుకుంటారు. `కల్కి 2898 AD’, ‘బ్రహ్మాస్త్ర’ కోసం మాత్రం అధికంగా ఛార్జ్ చేసారు. ఒక్కో కంపెనీ ప్ర‌క‌ట‌న‌కు 6 కోట్లు ఛార్జ్ చేస్తారు. ఆయ‌న హోస్ట్ చేస్తోన్న `కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి` ని హోస్ట్ చేస్తున్నందుకు 5 కోట్ల వ‌ర‌కూ ఛార్జ్ చేస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్లోనూ ఆయ‌న పెట్టుబ‌డులు పెట్టారు. బెంట్లీ, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ వోగ్, లెక్సస్, ఆడి, బెంజ్ కంపెనీలకు చెందిన కార్లు కూడా ఉన్నాయి. రూ.260 కోట్ల విలువైన ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది.