Begin typing your search above and press return to search.

ఐశ్వర్యను ఆ స్థితిలో చూసి షాక్ అయ్యాను.. అమితాబ్ బచ్చన్..

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ పై తనకి ఉన్న అభిమానాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:30 AM GMT
ఐశ్వర్యను ఆ స్థితిలో చూసి షాక్ అయ్యాను.. అమితాబ్ బచ్చన్..
X

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ పై తనకి ఉన్న అభిమానాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఐశ్వర్యారాయ్‌కు ,బచ్చన్ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆమె తన కూతురు ఆరాధ్యతో వేరుగా ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇటువంటి కాంట్రవర్సీలకి ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య అన్ని సజావుగా సాగుతున్నాయి అని అమితాబ్ మరొకసారి ఇండైరెక్టుగా స్పష్టం చేశారు.

ఐశ్వరరాయ్‌కు ఒకసారి షూటింగ్ సెట్స్ పై జరిగిన సంఘటనతో అమితా రెండు రోజులు నిద్రపోలేదట. తనకు ఐశ్వర్యారాయ్ పై ఎంతటి అభిమానం ఉందో ఈ మాటతో అమితాబ్ మరొకసారి స్పష్టం చేశారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్యామిలీ కోడలు కాకముందే అమితాబచ్చన్ తో ఎన్నో సినిమాలలో నటించింది. అమితాబ్ కూడా ఆమె తీరు నచ్చడంతో కూతురులా చూసుకునేవారు. 2003లో అమితాబచ్చన్, అక్షయ్ కుమార్ తో కలిసి ఐశ్వర్య ఖాకీ మూవీలో నటించారు.

2003లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నాసిక్ లో జరుగుతున్న సందర్భంలో ఐశ్వర్య‌కు ఓ చిన్ని ప్రమాదం ఎదురయింది. దాని గురించి ప్రస్తావించిన అమితాబ్.. ఆ కారు ప్రమాదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఓ సీన్లో కార్ అదుపుతప్పి వేగంగా వచ్చి ఐశ్వర్య కూర్చున్న కుర్చీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం అనిల్ అంబానీ ప్రైవేట్ విమానాన్ని ఉపయోగించారు.

అయితే నాసిక్ లో నైట్ ల్యాండింగ్ చేయడానికి సౌకర్యం లేకపోవడంతో దగ్గరలో ఉన్న సైనిక స్థావరంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ఢిల్లీ నుంచి స్పెషల్గా పర్మిషన్ కూడా తీసుకున్నారట. దీన్ని అందరూ చాలా చిన్న సంఘటనగా భావించినప్పటికీ ఐశ్వర్య గాయాలు చూసిన అమితాబ్ మాత్రం చలించిపోయారట. ఐశ్వర్య వీపు, కాళ్లకు తీవ్ర గాయాలు చూసిన అతనికి రెండు రోజులు నిద్ర పట్టలేదట. ఈ విషయాన్ని చెబుతూ అమితాబ్ భావోద్వేగానికి గురి అయ్యారు. తన కోడలిపై అమితాబ్ కు ఉన్న పితృవాత్సల్యం ఈ మాటలలో స్పష్టంగా కనిపిస్తోంది.