ప్రచారం కోసం బాలీవుడ్ మెగాస్టార్ ఎత్తుగడ!
అమితాబ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ మధ్య అనుబంధం అన్యోన్యతను ఆవిష్కరించింది ఈ టీవీ షో.
By: Tupaki Desk | 21 Nov 2024 2:30 AM GMTఅమితాబ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ మధ్య అనుబంధం అన్యోన్యతను ఆవిష్కరించింది ఈ టీవీ షో. ఓవైపు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడిపోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక అభిషేక్ ప్రస్తుతం తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
కౌన్ బనేగా కరోడ్‌పతి సమయంలో అభిషేక్ బచ్చన్ తాను తన తండ్రి అమితాబ్ బచ్చన్ కంటే మెరుగైన డ్రైవర్ ని అని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. అమితాబ్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టకుండా ట్రాఫిక్ ఉల్లంఘించే వారి ఫొటోలు తీయడంపై చమత్కరించారు. ప్రస్తుతం, వారు తమ కొత్త చిత్రం `ఐ వాంట్ టు టాక్`ను ప్రమోట్ చేస్తున్నారు, 22 నవంబర్ 2024న ఈ చిత్రం విడుదల అవుతుంది.
కేబీసీకి అతిథిగా వచ్చిన ఫిలింమేకర్ షూజిత్ సిర్కార్ బచ్చన్లను ఎవరు బెస్ట్ డ్రైవర్ అని అడిగినప్పుడు ఈ సరదా చర్చ సాగింది. ఈ క్లిప్ వేగంగా వైరల్ అయ్యింది.. సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది. ఎవరు బాగా డ్రైవ్ చేస్తారని ప్రశ్నించేప్పుడు.. అమితాబ్ ఆత్రంగా తన చేతిని పైకెత్తాడు. అయితే అభిషేక్ వెంటనే ``పా, దయచేసి!`` అని అన్నాడు. దీంతో అమితాబ్ సిగ్గుతో తన చేతిని కిందికి దించాడు. అభిషేక్, ``నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించావు, కానీ నేను చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాను`` అని చమత్కరించాడు. ఈ పరిహాసం ప్రేక్షకులను నవ్వించింది. అమితాబ్ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టడం కంటే ఇతర డ్రైవర్లను తిట్టడాన్ని ఎక్కువగా ఇష్టపడతారని అభిషేక్ చమత్కరించాడు. ఎవరైనా రాంగ్ రూట్ లో వస్తే, అమితాబ్ వారి ఫోటోను క్లిక్ చేయడానికి తన ఫోన్‌ని తీస్తాడు. అలా ఎందుకు చేస్తున్నావని నేను అడిగితే `సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులకు పంపిస్తాను` అని అంటాడు. ఇంతలో అవతలి వ్యక్తి ``వావ్ అమితాబ్ బచ్చన్ నా సెల్ఫీ తీసుకుంటున్నాడు!..`` అని ఫీలవుతాడు.. అనగానే అమితాబ్, షూజిత్ సిర్కార్‌తో సహా అందరూ ఫుల్ గా నవ్వుకున్నారు.
ప్రస్తుతం అభిషేక్ -షూజిత్ తమ కొత్త ఫ్యామిలీ డ్రామా `ఐ వాంట్ టు టాక్`ని ప్రమోట్ చేస్తున్నారు.సెన్సిటివ్ కంటెంట్ తో అద్భుత చిత్రాలు తెరకెక్కించే షూజిత్తో అభిషేక్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్. అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సీతాబోకి షూజిత్ దర్శకత్వం వహించాడు.