Begin typing your search above and press return to search.

మ‌రోసారి అస‌హ‌నం బ‌య‌ట‌పెట్టిన సూప‌ర్‌స్టార్

ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బ‌చ్చ‌న్ విడిపోతున్నారంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 8:00 PM GMT
మ‌రోసారి అస‌హ‌నం బ‌య‌ట‌పెట్టిన సూప‌ర్‌స్టార్
X

ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బ‌చ్చ‌న్ విడిపోతున్నారంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది. మీడియాలు అవాకులు చ‌వాకులు రాస్తున్నాయంటూ సీనియ‌ర్ బ‌చ్చ‌న్ తో పాటు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా త‌మ‌ కోపాన్ని ప‌రోక్షంగా ప్ర‌ద‌ర్శించారు. నేరుగా విష‌యం చెప్ప‌కుండానే మీడియాకు చుర‌క‌లు వేసేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న బ్లాగులో రాస్తూ.. మీడియా వ్యాపారం కోసం.. వార్త‌లు అమ్ముకునేందుకు ఇలా రాస్తుంటార‌ని వ‌ర్ణించారు.

అయితే మీడియా తొంద‌ర‌పాటును నేరుగా ప్ర‌స్థావించ‌కుండానే వీలున్న వేదిక‌ల‌పై స‌మాధానం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక వేడుక‌లో ఐష్‌-అభి జంట‌ కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. ఇంత‌లోనే మ‌రోసారి సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ క్రిప్టిక్ పోస్ట్‌తో మ‌రోసారి త‌న అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు.

త‌న బ్లాగులో ఇడియట్స్ పరిమిత మెదడు ఉన్నవారు.. ఈ ప్రపంచంలో అలాంటి వారికి ఎప్పుడూ కొద‌వ‌లేదు.. స‌గం తెలివితేట‌ల‌తో బుద్ధి హీన‌మైన వారు.. వారి లోపాలను దాచడానికి ప్రతిరోజూ అసంబద్ధమైన నకిలీ వార్త‌లను తయారు చేసి ముద్రిస్తారు! అని విమ‌ర్శిస్తూ రాసారు. ``T 5216 - బనానే వాలే జో హర్ శబ్ద్ కా అప్నా హీ అర్థ్ నికల్తే హై, అప్నా నిజి జీవన్ కే అనర్త్ కో చిపాతే`` అని అమితాబ్ ఇందులో రాసారు. రాసేవారి వ్య‌క్తిగ‌త జీవితంలో దుర‌దృష్టాల‌ను దాస్తూ.. ప్ర‌తి ప‌దం నుంచి సొంత అర్థం పొందేలా రాస్తారు! అని విమ‌ర్శిస్తూ స్మైల్ ఈమోజీని షేర్ చేసారు.

అయితే అమితాబ్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అత‌డు మీడియాపై చాలా అస‌హ‌నంగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే అమితాబ్ ట్వీట్ కి స్పందిస్తూ ఒక నెటిజ‌న్ ఇలా రాసారు. పిల్లలు లేని వ్యక్తులు తమ పిల్లలను ఎలా పెంచాలో తల్లిదండ్రులకు సలహా ఇచ్చినట్లే! అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా.. మరొకరు.. నేటి ప్రపంచంలో తప్పుగా అర్థం చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది! అని రాశారు.

పుకార్ల‌తో ఇబ్బంది:

ఐశ్వర్య-అభిషేక్ బ‌చ్చ‌న్ జంట ఇటీవ‌లే ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా.. ఐశ్వ‌ర్యారాయ్ త‌ల్లి బృందారాయ్ కూడా వారితో ఉన్నారు. స్నేహితులు, బంధువులు షేర్ చేసిన ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ జంట ఫోటోల‌ను షేర్ చేసి వారి క‌ల‌యిక‌పై త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ 17 సంవత్సరాలకు పైగా గొప్ప అనుబంధాన్ని క‌లిగి ఉన్నారు. కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఎదిగే వ‌య‌సులో ఈ పుకార్లు ఇబ్బందిక‌రంగా మారాయి.