Begin typing your search above and press return to search.

బన్నీ పై బిగ్ బీ ప్రేమ.. మరోసారి ఇలా..

అల్లు అర్జున్ పై ఇంకా పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్ బీ. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపుకు అర్హుడని అన్నారు. తాను కూడా అతనికి వీరాభిమానినని అన్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:27 AM GMT
బన్నీ పై బిగ్ బీ ప్రేమ.. మరోసారి ఇలా..
X

పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పై మరోసారి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతకుముందే అల్లు అర్జున్ పనితీరుకి తాను పెద్ద అభిమానినని అన్నాడు. రిలీజ్ ముందు ఈ సంభాషణలు బాలీవుడ్ ఫ్యాన్స్ ని అలరించాయి. లేటెస్ట్ గా మరోసారి అల్లు అర్జున్ పై తన ప్రేమను ప్రదర్శించారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో లేటెస్ట్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చింది. షోలో పాల్గొన్న కోలకత్త కి చెందిన ఒక మహిళ అల్లు అర్జున్ ఇంకా అమితాబ్ అంటే ఇష్టమని అన్నది. దానికి సమాధానంగా అమితాబ్ బచ్చన్ కూడా అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టమని అన్నాడు.

అల్లు అర్జున్ పై ఇంకా పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్ బీ. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపుకు అర్హుడని అన్నారు. తాను కూడా అతనికి వీరాభిమానినని అన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మంచి సక్సెస్ అందుకుంది. మీరు చూడకపోతే సినిమా చూడండని అన్నారు. ఐతే అతని గొప్ప ప్రతిభ గల వ్యక్తి అతన్ని తనతో పోల్చొద్దు అని అన్నారు అమితాబ్. ఐతే దానికి ఆమె కొన్ని సీన్స్ లో మీ ఇద్దరి మేనరిజం తనకు ఒకేలా ఉంటాయని అన్నది. అతన్ని కలవాలని ఉందని అన్నది.

అల్లు అర్జున్ కి నార్త్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఐతే సగటు ప్రేక్షకుడు అభిమానిగా మారడం వరకు ఓకే కానీ ప్రతి సందర్భంలో అమితాబ్ బచ్చన్ కూడా అల్లు అర్జున్ వర్క్ గురించి.. అతని సక్సెస్ గురించి మాట్లాడటం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. తన సహ నటుడి గురించి అమితాబ్ ఇంతగా పొగుడుతున్నాడు అంటే అతని హృదయం ఎంత గొప్పదో అని అనుకుంటున్నారు.

ఇక అల్లు అర్జున్ పై అమితాబ్ చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానానికి అల్లు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన అమితాబ్ మరో నటుడి తెర వెనక కష్టం గురించి తెలుసు కాబట్టి అల్లు అర్జున్ పై ఈ కామెంట్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. అమితాబ్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు చూపిస్తున్న ఈ అభిమానం చూసి సినీ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.