వడ పావ్‌ని ఇష్టంగా తినే సూపర్‌స్టార్
కేబీసీతో అమితాబ్ అనుబంధం గురించి తెలిసిందే. ఇప్పటికి 15 సీజన్లను విజయవంతంగా నడిపించిన మేధోప్రజ్ఞ ఆయన సొంతం.
By: Tupaki Desk | 22 Oct 2024 11:30 AM GMTకేబీసీతో అమితాబ్ అనుబంధం గురించి తెలిసిందే. ఇప్పటికి 15 సీజన్లను విజయవంతంగా నడిపించిన మేధోప్రజ్ఞ ఆయన సొంతం. `కౌన్ బనేగా కరోడ్‌పతి 16` ఎపిసోడ్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన గిల్టీ ప్లెజర్ ఫుడ్‌ను బయటపెట్టారు. పోటీదారు హర్ష ఉపాధ్యాయ్‌తో సంభాషణ సందర్భంగా.. అనుభవజ్ఞుడైన నటుడు అమితాబ్ తనకు అన్ని వంటకాలతో పరిచయం లేకపోయినా, తాను కచ్చితంగా ఇష్టపడే ఒక చిరుతిండి ఉందని బహిర్గతం చేసారు.
ఆ చిరుతిండి మరేదో కాదు.. వడ పావ్. గుజరాత్‌కు చెందిన కళలు, క్రాఫ్ట్స్, సంగీత ఉపాధ్యాయుడు హర్ష ఉపాధ్యాయ తదుపరి ఎపిసోడ్‌లో హాట్ సీట్ లో కనిపించనున్నారు. ఆహారానికి సంబంధించిన ప్రశ్న తర్వాత లైట్ హార్ట్ మూవ్ మెంట్స్ ని షేర్ చేసుకునే సమయంలో అమితాబ్‌ను `చుర్మా`ను ఆస్వాధిస్తారా? అని అమితాబ్ ని అడిగాడు. దానికి అతడు నవ్వుతూ తనకు అన్ని వంటకాలు తెలియకపోయినా, వడ పావ్ తన ఇష్టమైన చిరుతిండి అని తెలిపారు.
బిగ్ బి హిందీలో ఇలా వ్యాఖ్యానించారు. ``ఉస్సే బధ్కర్ కోయి చీజ్ నహీ హై, ఛోటా సా హై పర్ లేకీన్ ఇత్నా బడియా హై... హర్ జగహ్ మిల్తా హై-సిర్ఫ్ దేశ్ మే హాయ్ నహీ, పర్ దేశ్ మే భీ`` అని అన్నారు. దీనర్థం.. వడపావ్ కంటే మెరుగైనది ఏమీ లేదు.. ఇది చిన్నది, కానీ చాలా రుచికరమైనది... మీరు దీన్ని ప్రతిచోటా చూడవచ్చు-భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా..
ఈ వ్యాఖ్యానంతో అమితాబ్ ఒదిగి ఉండే స్వభావం మరోసారి రుజువైంది. పోటీదారులందరితో ఆయన ఎంత చిల్లింగ్ గా సరదాగా ఉంటారో వెల్లడైంది. విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్-కామెడీ `భూల్ భూలయ్యా 3`ని ఈ షోలో ప్రమోట్ చేసేందుకు పాల్గొన్నారు .
`కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16` ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. బిగ్ బి ఇటీవల `కల్కి 2898 AD` చిత్రంలో అశ్వత్థామగా నటించారు. ప్రభాస్, కమల్ హాసన్, దీపిక లాంటి స్టార్లతో కలిసి అమితాబ్ నటించారు. సీక్వెల్ లోను ఆయన పాత్ర ప్రభావవంతంగా ఉండనుంది.
మేటి నటిపై బిగ్ బి కామెంట్:
అమితాబ్ ఇంకా వ్యాఖ్యానిస్తూ.. ``మీనా కుమారి జీతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. `సాహిబ్ బీవీ ఔర్ గులాం`లో ఒక పాట ఉంది - `నా జావో సయాన్`..అందులో ఆమె చాలా మనోహరంగా అభినయించారు. నేను ఆమెను నిరంతరం చూస్తున్నాను. నిశ్శబ్దంగా ఒకే చోట కూర్చొని పాట పాడే కళ.. ఆమె తేజస్సుతో పాటు ప్రభావం అద్భుతంగా ఉండేది.`` అని అన్నారు.