Begin typing your search above and press return to search.

350కోట్లు ఆర్జించి 120కోట్ల ప‌న్ను చెల్లించిన న‌టుడు!

ఈ న‌టుడి వ‌యసు 82. ఏడాది సంపాద‌న 350 కోట్లు. ఇందులో 2024-25 సంవ‌త్స‌రానికి 120 కోట్లు వార్షిక ప‌న్ను చెల్లించాడు.

By:  Tupaki Desk   |   18 March 2025 8:45 AM IST
350కోట్లు ఆర్జించి 120కోట్ల ప‌న్ను చెల్లించిన న‌టుడు!
X

ఈ న‌టుడి వ‌యసు 82. ఏడాది సంపాద‌న 350 కోట్లు. ఇందులో 2024-25 సంవ‌త్స‌రానికి 120 కోట్లు వార్షిక ప‌న్ను చెల్లించాడు. భార‌త‌దేశంలో అత్యధిక ప‌న్ను చెల్లించిన మేటి న‌టుడిగా అత‌డి పేరు మార్మోగుతోంది. ఇంత లేటు వ‌య‌సులోను అత‌డి సంపాద‌న ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. దానికి మించి ఆయ‌న ఆరోగ్యం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. భారీ పాన్ ఇండియా సినిమాల్లో కీల‌క పాత్ర‌లు.. అభిమానుల‌తో ప్ర‌తి రోజూ మాట్లాడే విధానం.. టీవీ రియాలిటీ షో హోస్టింగ్ ఇలా ఏది చూసినా అలుపెరుగ‌ని యోధుడిగా క‌నిపిస్తున్నాడు.

అత‌డు మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్. ఆయ‌న ఆరు ద‌శాబ్ధాలుగా న‌టిస్తూనే ఉన్నారు. 82 ఏళ్ల వయసులో పాన్ ఇండియా సినిమాల్లో దుమ్ము రేపుతున్నాడు. ఇటీవ‌ల ప్ర‌భాస్ `కల్కి 2898 ఏడి`లో అశ్వథ్థామ పాత్రతో విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకున్నారు. త‌దుప‌రి కల్కి 2 చిత్రీకరణలోను పాల్గొన‌నున్నాడు.

దీంతో పాటు బ‌చ్చ‌న్ జీ రియాలిటీ షోలు చేస్తున్నారు. వాణిజ్య ప్ర‌క‌ట‌నల్లో బిజీగా న‌టిస్తున్నాడు. అలాగే రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెడుతూ భారీ లాభాలార్జిస్తున్నారు. అమితాబ్ ఒక్కో సినిమాకి కోట్ల‌లో పారితోషికాలు అందుకుంటున్నారు. ప్ర‌ఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన‌ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. కౌన్ బనేగా కరోడ్‌పతిని హోస్ట్ గాను భారీగా ఆర్జిస్తున్నాడు. అయితే ఏడాది కాలంలో 350కోట్లు ఆర్జించి 120కోట్ల ప‌న్ను చెల్లించార‌నేది నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే వార్త‌. అత‌డు సినిమాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, రియ‌ల్ ఎస్టేట్ స‌హా వివిధ కంపెనీల ద్వారా ఆర్జించిన మొత్తం నుంచి అంత ప‌న్ను చెల్లించి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

బ‌చ్చ‌న్ జీ.. మార్చి 15న రూ. 52.50 కోట్లు ముందస్తు పన్ను చెల్లించడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప‌న్ను చెల్లింపుల్లో ఆయ‌న అంద‌రికీ స్ఫూర్తి. అమితాబ్ త‌ర‌హాలో నే ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్‌, విజయ్ లాంటి పెద్ద స్టార్లు స‌మ‌యానికి ప‌న్ను చెల్లిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.