Begin typing your search above and press return to search.

తెలుగు చిత్ర‌సీమ‌లో స‌భ్యుడిని అని చెప్పుకోవ‌డానికి గ‌ర్విస్తున్నాను: అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్, లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఇప్పటి వరకు సౌత్ లో ఐదారు సినిమాల్లో న‌టించారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:40 PM GMT
తెలుగు చిత్ర‌సీమ‌లో స‌భ్యుడిని అని చెప్పుకోవ‌డానికి గ‌ర్విస్తున్నాను: అమితాబ్
X

బాలీవుడ్ మెగాస్టార్, లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఇప్పటి వరకు సౌత్ లో ఐదారు సినిమాల్లో న‌టించారు. ఈరోజు తెలుగు సినిమాలో భాగమైనందుకు గర్విస్తున్నానని అన్నారు. ``నేను తెలుగు చిత్ర పరిశ్రమలో సభ్యుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను`` అని అమితాబ్ బచ్చన్ అన్నారు. నన్ను వారి సినిమాల్లో భాగం చేసినందుకు నాగార్జున‌, చిరంజీవి, నాగ్ అశ్విన్‌లకు ధన్యవాదాలు అని అమితాబ్ బచ్చన్ అన్నారు.

నేటి సాయంత్రం (28 అక్టోబ‌ర్) హైదరాబాద్‌లో అమితాబ్ బచ్చన్ ANR జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మ‌క‌ అవార్డును అందజేశారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు విశేష కృషి చేసిన నటులకు ANR జాతీయ అవార్డును అందజేస్తుంది.

నాగార్జున నిర్మించిన `మనం`లో అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి`లో అమితాబ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన `కల్కి 2898 AD`లో అమితాబ్ చాలా పెద్ద పాత్ర పోషించారు. అశ్వ‌థ్థామ‌గా ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయింది.

త‌న టాలీవుడ్ స్నేహితుడైన చిరంజీవి స్నేహం, వినయం ఆతిథ్యానికి అమితాబ్ బచ్చన్ కృతజ్ఞతలు తెలిపారు. కింగ్ నాగార్జున‌, అక్కినేని కుటుంబంపైనా ప్ర‌శంస‌లు కురిపించారు. కింగ్ నాగార్జున కెరీర్ జ‌ర్నీ, తెలుగు సినిమాకి, భార‌తీయ సినిమాకి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు అమితాబ్ ప్ర‌శంస‌లు కురిపించారు. నాగ్, ఆయ‌న కుటుంబానికి అమితాబ్ హ్యాట్సాఫ్ చెప్పారు.