ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో అద్భుతం!
అటుపై అక్కడే ఉన్న చిరంజీవి తల్లి అంజనాదేవిని చిరంజీవి అమితాబ్ కు పరిచయం చేయగా బీగ్ బీ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 10:04 AM GMTబాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ సాధించిన విజయాలు..అందుకున్న అవార్డులు..రివార్డులు మాత్రమే అమితాబ్ ని అగ్ర స్థానంలో కూర్చబెట్టలేదు. ఆయన లెజెండరీగా ఎదిగారు అంటే అంతకు మించి గొప్ప వ్యక్తిత్వం గల మనిషి కాబట్టే అది సాధ్యమైంది? అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ఆయనలో ఎప్పుడు కనిపిస్తుంది. పెద్దల్ని గౌరవించడం...చిన్న వాళ్లను ఆశీర్వదించడం..నవతారాన్ని ప్రోత్సహిం చడం.. కొత్త తరానికి బాటలు వేయడం వంటివాటితోనే అసలైన లెజెండ్ అవుతారు.
అందుకు అక్షర రూపం అమితాబచ్చన్. నిన్నటి రోజున టాలీవుడ్ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు...చోటు చేసుకున్న సన్నివేశాలతో ఆయన ఊరకనే లెజెండ్ అవ్వలేదు అనిపిస్తుంది. పెద్దలంటే ఆయన గౌరవించే విధానం...నడుచుకునే విధానం...ప్రవర్తించే తీరు? చిరంజీవి సహా అందరికీ ఇనిస్ప్రేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి, నాగార్జున సహా కుటుంబసభ్యులంతా అమితాబ్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అటుపై అక్కడే ఉన్న చిరంజీవి తల్లి అంజనాదేవిని చిరంజీవి అమితాబ్ కు పరిచయం చేయగా బీగ్ బీ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వేడుకలో ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంటుందని ఏ మాత్రం ఎవరూ ఊహించనది. పెద్దలంటే అమితాబ్ కి ఎంతటి గౌరవమర్యాదలు అన్నది మరోసారి నిన్నటి రోజున ప్రూవ్ అయింది. దేశం గర్వించ దగ్గ నటుడు తన స్థాయిని, స్థానాన్ని పక్కనబెట్టి పెద్దావిడ ఆశీర్వాదం తీసుకోడం ఎంతో అద్భుతమైన దృశ్యంలా అనిపించింది.
ఆ లెజెండ్ ని ఆశీర్వదించాలంటే? ఆ తల్లే కాస్త మోహమాట పడినట్లు అనిపించింది. అదే ఆయన స్థానానికి ఆ తల్లి ఇచ్చిన గొప్ప గౌరవం. ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదని బిగ్ బీ రూపంలో చూసారంతా. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో పదిలంగా నిలిచిపోయే ఓ గొప్ప జ్ఞాపకం. ఇంతకుమించి మెగాస్టార్ సాధించాల్సింది ఏముంటుంది.