ఏళ్ల వరకూ లిప్ లాక్ ట్రై చేయని సీనియర్!
బిగ్ బీ అమితాబచ్చన్ సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు.
By: Tupaki Desk | 7 March 2025 12:45 PM ISTబిగ్ బీ అమితాబచ్చన్ సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్నో వైవిథ్యమైన సినిమాలు చేసి తనకంటూ బాలీవుడ్ చరిత్రలో కొన్ని పేజీలు రాసిపెట్టారు. బిగ్ బీ ఎంట్రీతో బాలీవుడ్ గ్లామర్ రెట్టింపు అయిందన్నది అంతే వాస్తవం. ఒకప్పుడు హీరోగా పనికిరాని ముఖం అని విమర్శ లు ఎదుర్కున్న బిగ్ బీ తర్వాత కాలంలో స్టార్ గా ఎదగడంతో? అదే ఇండస్ట్రీ ఆయనకు దాసోహమైంది.
ఆయన సినిమాలో చిన్న పాత్ర పోషించినా చాలు గొప్ప గౌవరం అనే స్థాయికి ఎదిగారు. ఇక హీరోయిన్లు అయితే ఆయనతో నటించడానికి అంతే ఆసక్తి చూపించేవారు. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. 80 ఏళ్లు మీద పడినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారాయన. `కల్కి 2898` లో అమితాబ్ పెర్పార్మెన్స్ చూసి నిజంగా ప్రేక్షకులు స్టన్ అయిపోయారు.
ఆ సినిమా తర్వాత అమితాబ్ పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిపోయారు. అయితే అలాంటి నటుడు హీరోయిన్ తో తొలి ముద్దు ఎప్పుడు అందుకున్నారంటే? 60 ఏళ్ల వయసులోనని తెలుస్తోంది. 36 ఏళ్ల వయ సున్న నటి రాణిముఖర్జీ తో తొలి లిప్ లాక్ సీన్ చేసారు. ఇప్పుడీ సన్నివేశాన్ని గుర్తి చేసుకుని యువత నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఒక్కసారి ఈ సీన్ లోకి వెళ్తే...
`బ్లాక్` సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఇది 2005లో రిలీజ్ అయింది. ఇందులో రాణీ ముఖర్జీ అంధురాలి పాత్ర పోషిస్తుంది. సినిమా క్లైమాక్స్ లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరే లెవల్‌లో ఉంటాయి. ముద్దు ఎలా ఉంటుందో అని క్లైమాక్స్‌లో అమితాబ్ ని అడిగి మరీ పెట్టుకుంటుంది హీరోయిన్ రాణీ ముఖర్జీ. అయితే ఈసీన్ షూట్ చేసిన రోజు తాను రెండుసార్లు బ్రెష్ చేసుకుని అమితాబ్ దగ్గరకు వెళ్లినట్లు గత ఇంటర్వ్యూల్లో రాణీ ముఖర్జీ రివీల్ చేసారు.