Begin typing your search above and press return to search.

'కల్కి 2898 AD'పై అమితాబ్ మ‌న‌వ‌రాళ్ల పంచ్

పోటీదారు తన కుటుంబ మద్దతుతో కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించాన‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:00 AM GMT
కల్కి 2898 ADపై అమితాబ్ మ‌న‌వ‌రాళ్ల పంచ్
X

అమితాబ్ బచ్చన్ పబ్లిక్ ఇంటరాక్షన్‌లలో తనదైన‌ హాస్య‌చ‌తుర‌త‌తో ప్రసిద్ది చెందారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 16 హోస్ట్ గా ఉన్న ఆయ‌న ఇటీవలి ఎపిసోడ్‌లో పోటీదారు త్రిశూల్ సింగ్ చౌదరితో స‌ర‌దా సంభాష‌ణలో పాల్గొన్నారు. అమితాబ్, త్రిశూల్‌తో సంభాషణ సమయంలో కల్కి 2898 ADపై తన మనవరాళ్ల పంచ్ గురించి బిగ్ బి చెప్పాడు.

KBC 16లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ త్రిశూల్‌(30)ను సెప్టెంబర్ 16న అమితాబ్ స్వాగతించారు. పోటీదారు తన కుటుంబ మద్దతుతో కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించాన‌ని తెలిపారు. పోటీదారుడు హాట్ సీట్‌లో చోటు దక్కించుకుని ఆత్మవిశ్వాసంతో వచ్చినప్పటికీ భయాన్ని వ్యక్తం చేశాడు. హోస్ట్ అమితాబ్ అత‌డికి వెచ్చని కౌగిలింత ఇవ్వడం ద్వారా సౌకర్యంగా అత‌డిని మార్చాడు. అమితాబ్ గేమ్‌ప్లేలో కొన్ని నియమాలను మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఆ స‌మ‌యంలో త్రిశూల్ నేరుగా అమితాబ్‌ను ప్ర‌శ్నిస్తూ.. మీరు ఎప్పుడైనా బీన్ బ్యాగ్‌పై కూర్చున్నారా? అని అడిగారు. సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, బీన్ బ్యాగ్‌లు వృద్ధులకు ఉద్దేశించి తాయ‌రు చేయ‌లేదు అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, త్రిశూల్ `అయితే మీ వయస్సు 40 లేదా 45 సంవత్సరాలు మాత్రమే` అని వ్యాఖ్యానించ‌డంతో అమితాబ్ చిరునవ్వుతో స్పందించాడు.

మరో సరదా ఇంటరాక్షన్‌లో అమితాబ్ తన మనవరాళ్లతో కలిసి చూడటానికి వెళ్లిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం తనకు అర్థం కాలేదని చెప్పాడు. ``మేం కూడా కల్కిని అర్థం చేసుకోలేదు`` అని వారు రివ‌ర్స్ పంచ్ వేసార‌ని, చాలా కామెడీ చేసారని తెలిపారు. 2898 ADలో కల్కిలో అశ్వత్థామగా అమితాబ్ నటనను త్రిశూల్ ఈ వేదిక‌పై ప్రశంసించారు.

కల్కి 2898 AD అనేది నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-థ్రిల్లర్. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, శాశ్వత ఛటర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహాభారతం.. పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచానికి లింక్ చేస్తూ కాన్సెప్ట్ ని రూపొందించారు. అలాగే 2025లో కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్‌ను ప్రారంభిస్తారు. దీపికతో కలిసి R బాల్కీ `ది ఇంటర్న్` రీమేక్‌లో కూడా అమితాబ్ కనిపించనున్నాడు. ఇంటర్న్ ఒరిజిన‌ల్ తారాగణంలో రాబర్ట్ డి నీరో, అన్నే హాత్వే త‌దిత‌రులు న‌టించారు.