Begin typing your search above and press return to search.

'కల్కి' అశ్వత్థామ కి ఏమాత్రం తగ్గకుండా...!

అంతటి గుర్తింపు దక్కించుకున్న అమితాబ్ అదే తరహా ప్రాముఖ్యత ఉండే పాత్ర తో రాబోతున్నాడట.

By:  Tupaki Desk   |   28 Sep 2024 11:00 PM GMT
కల్కి అశ్వత్థామ కి ఏమాత్రం తగ్గకుండా...!
X

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సౌత్‌ సినిమాల్లో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలంటూ ఆయన్ను సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒకే సారి రెండు సినిమాల్లో నటించారు. అందులో ప్రభాస్ 'కల్కి' సినిమా విడుదల అయింది. కల్కి లో అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించాడు. పది అడుగుల పొడవు ఉండే పాత్రలో అమితాబ్ ను చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రభాస్ పాత్రను డామినేట్‌ చేసే విధంగా ఉందని సైతం టాక్ వచ్చింది. అంతటి గుర్తింపు దక్కించుకున్న అమితాబ్ అదే తరహా ప్రాముఖ్యత ఉండే పాత్ర తో రాబోతున్నాడట.

కల్కి సినిమా తర్వాత సౌత్‌ లో అమితాబ్ 'వేట్టయాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం అందుతోంది. తాజాగా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. ముఖ్యంగా సినిమా లోని రజినీకాంత్‌ పాత్ర గురించి, మంజు వారియర్‌ పాత్ర గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమితాబ్‌ పాత్ర గురించి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వ్యాఖ్యలు చేసి సినిమా పై అంచనాలు పెంచారు.

వేట్టయాన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారి పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఆయన కల్కి సినిమాలో ప్రభాస్ తో నటించి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఇప్పుడు రజినీకాంత్‌ మూవీలో సైతం అమితాబ్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, అంతే కాకుండా సినిమాలో ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్ సైతం ఎక్కువ ఉంటుందని సమాచారం అందుతోంది. ఆకట్టుకునే అమితాబ్‌ పాత్ర వల్ల సినిమా స్థాయి పెరుగుతుందని మేకర్స్ బలంగా నమ్మతున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు వేట్టయాన్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జై భీమ్‌ సినిమా తర్వాత టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా సూపర్‌ స్టార్ రజినీకాంత్ జైలర్ తో రూ.400 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఇటీవల విడుదల అయిన టీజర్ తో క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మంజు వారియర్‌ పోషించిన పాత్రకు మంచి స్పందన దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇటీవల విడుదల అయిన మనసిలాయో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. తెలుగు లోనూ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.