దశరథుడిగా మెగాస్టార్?
రామాయణం తారాగణంలో ఇప్పుడు మెగాస్టార్ వచ్చి చేరారని తెలిసింది. తాజా సమాచారం మేరకు.
By: Tupaki Desk | 13 Feb 2024 4:58 AM GMTనితీష్ తివారీ రామాయణం కాస్టింగ్ అంతకంతకు వేడి పెంచుతోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణాసురుడిగా యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా ఎంపికయ్యారని ఇప్పటికే కథనాలొచ్చాయి.
రామాయణం తారాగణంలో ఇప్పుడు మెగాస్టార్ వచ్చి చేరారని తెలిసింది. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. జూమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కథనం ప్రకారం.. ఈ చిత్రంలో కింగ్ దశరథ్‌గా నటించడానికి అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. అయితే ఇదే మొదటిసారి కానప్పటికీ ఈ తరహా పాత్రను పోషించడానికి లెజెండరీ నటుడు ఎంపికయ్యారనేది ఉత్కంఠను పెంచుతోంది.
చాలా సంవత్సరాల క్రితం సంజయ్ ఖాన్ తన అల్లుడు హృతిక్ రోషన్ శ్రీరాముడిగా ఎంపిక చేసుకుని, అతని కుమారుడు జాయెద్ ఖాన్ ని లక్ష్మణ్‌గా ఊహించి 'ది లెజెండ్ ఆఫ్ రామ' అనే చిత్రాన్ని ప్లాన్ చేసాడు. మిస్టర్ బచ్చన్ ని కింగ్ దశరథ్‌గా నటింపజేయడానికి సంప్రదించారు. అయితే ఆ చిత్రం విఫలమైంది. ఆరంభ దశలోనే ఆపేసారు. కానీ ఈసారి నీతీష్ తివారీ రామాయణంలో మెగాస్టార్ పాత్ర ఖరరైనట్టేనని వినిపిస్తోంది. ప్రభాస్ తో కల్కి తర్వాత అమితాబ్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
రణబీర్ కపూర్ - సాయి పల్లవితో రామాయణం చిత్రీకరణ మార్చి 2024లో ప్రారంభమవుతుంది. సన్నీ డియోల్ మేలో తన పాత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. జూలైలో యష్ తారాగణంలో చేరనున్నారు. దీపావళి 2025 విడుదలను లక్ష్యంగా చేసుకుని యష్ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత రామాయణం షూటింగ్‌ను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం మూడు భాగాల సిరీస్‌గా ప్లాన్ చేసారు. కొన్ని నెలల క్రితం రణబీర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లి VFX కంపెనీతో రామాయణం ప్రీ-విజువలైజేషన్ ని పరిశీలించారని తెలిసింది.