Begin typing your search above and press return to search.

కంటెస్టెంట్ కి సెల్యూట్ చేసిన లెజెండ‌రీ!

స‌మాధానాలు చెప్ప‌డానికి వెళ్లిన కంటెంస్టెంట్ ని ఎంతో ఉత్సాహ‌ప‌రిచి ముందుకు తీసుకెళ్తారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 12:23 PM GMT
కంటెస్టెంట్ కి సెల్యూట్ చేసిన లెజెండ‌రీ!
X

లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ ఇప్ప‌టికీ కౌన్ బ‌నేగా క‌రోడ్ప‌తీ షోను స‌క్సెస్ పుల్ గా హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో వేదిక‌గా ఆయ‌న కంటెంస్టెంట్ తో పాటు లైవ్ లో ఉన్న ప్రేక్ష‌కుల‌తో త‌న‌కు సంబంధించిన ఎన్నో విష‌యాలు షేర్ చేస్తుంటారు. కోటి రూపాయ‌ల షో అయినా? అది ఎంతో స‌ర‌దాగా సాగుతుంది. స‌మాధానాలు చెప్ప‌డానికి వెళ్లిన కంటెంస్టెంట్ ని ఎంతో ఉత్సాహ‌ప‌రిచి ముందుకు తీసుకెళ్తారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నో విష‌యాలు పంచుకుంటారు. తాజాగా పంజాబ్ కి చెందిన నేహా ఈ షోకి హాజ‌రయ్యారు. ఈషోలో ఆమె ఆర్మీలో చేర‌తాన‌ని బిగ్ బీ ఎదుట అంటారు. దీనికి బిగ్ బీ వెంట‌నే లేచి సెల్యూట్ చేసారు. అవ‌కాశం వ‌స్తే స్వ‌చ్ఛ‌దంగా చేర‌తాన‌న్నారు. `సైన్య్ నాకెంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. వారి ధ‌రించే యూనిఫా అంటే ఎంతో ఇష్టం.

ప్ర‌తీ ఒక్క‌రు మూడు -నాలుగు నెల‌లు ఆర్మీలో శిక్ష‌ణ పొందాల‌ని నేను సూచిస్తా` అన్నారు. అలా నేహ దేశ‌భ‌క్తి చాటారు. ఆమె మాట‌ల‌కు అమితాబ్ ఫిదా అయిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సెల్యూట్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఓమ‌హిళ నోట అలాంటి మాట‌లు రావ‌డం అన్న‌ది చాలా అరుదు. దేశానికి సేవ చేయాల‌ని ఎంతో ధైర్య‌సాహ‌సాలుంటే తప్ప ముందుకు రాలేరు.

దీంతో ఆమె వ్యాఖ్య‌ల‌కు బిగ్ బీ ఫిదా అయిపోయారు. ఇది ఎంతో గొప్ప విష‌యం అని అమితాబ్ పొగిడారు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అభిమానులంతా మేరే భార‌త్ మ‌హాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. నేహా కి అంతా అభినందిస్తున్నారు.