పెళ్లికి ముందే కండీషన్లు..పెద్దావిడ షాక్!
అప్పుడే ఆయన ఓ కండీషన్ పెట్టారు. 9-5 షిప్ట్ లో పనిచేసే భార్య నాకు అవసరం లేదన్నారు. వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ రోజూ షూటింగ్ కి వెళ్లడానికి వీలు లేదు అన్నారు.
By: Tupaki Desk | 24 July 2024 10:30 AM GMTబాలీవుడ్ ఆలుమగలు అమితాబచ్చన్-జయాబచ్చన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ఎంతో యాక్టివ్ గా కనిపిస్తారు. బాలీవుడ్ లో ఏ ఫంక్షన్ కి వెళ్లాలన్నా జంటగా హాజరై అతిధుల్ని, అభిమానుల్ని అలరి స్తుంటారు. ఇటీవలే ఆ జోడీ అంబానీ ఇంట పెళ్లి వేడుకలో తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. అతిధులందరితో కలిసి మేము సైతం అంటూ డాన్సు అందుకున్నారు.
జయాబచ్చన్ ఇంటిని..అమితాబ్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సినిమాలకి దూరంగా ఉన్నా.. రాజకీయాల్లోనూ ఆమె యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆసంగతిని పక్కనబెడితే ఓ ఇల్లాలిగా తన బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తున్నారన్నది ఓపాడ్ కాస్ట్ లో రివీల్ చేసారు. 'పెళ్లి నాటికి నేను నటిగా రాణిస్తున్నా. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. సినిమాలన్నీ పూర్తి చేసి1973 అక్టోబర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
అప్పుడే ఆయన ఓ కండీషన్ పెట్టారు. 9-5 షిప్ట్ లో పనిచేసే భార్య నాకు అవసరం లేదన్నారు. వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ రోజూ షూటింగ్ కి వెళ్లడానికి వీలు లేదు అన్నారు. మంచి కథలు ఎంచుకుని, సరైన మనుషులతో పనిచేయాలని చెప్పారు. 'జంజీర్' విజయం తర్వాత ఇద్దరం టూర్ కి వెళ్లాలనుకున్నాం. ఈ విషయం వాళ్లింట్లో తెలిసింది. పెళ్లికి ముందు ఇలాంటి విహార యాత్రలు కుదరదన్నారు.
జూన్ లో పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టారు. అదే విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడారు. అప్పుడే పెళ్లి చేయాలని మా నాన్న అనుకోలేదు. కానీ మా ఇష్టాల్ని గౌరవించి 1973 జూన్ లోనే వివాహం చేసారు' అని తెలిపారు.