Begin typing your search above and press return to search.

వైరల్‌ : కావ్య కన్నీళ్ల పై మెగాస్టార్‌ రియాక్షన్‌

ఐపీఎల్‌ మ్యాచ్ లు జరుగుతున్నన్ని రోజులు సోషల్‌ మీడియాలో క్రికెటర్‌ లతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   28 May 2024 6:11 AM GMT
వైరల్‌ : కావ్య కన్నీళ్ల పై మెగాస్టార్‌ రియాక్షన్‌
X

ఐపీఎల్‌ మ్యాచ్ లు జరుగుతున్నన్ని రోజులు సోషల్‌ మీడియాలో క్రికెటర్‌ లతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమెకు ఆటపై ఉన్న ప్యాషన్ తో ఆటగాళ్ల వేలం మొదలుకుని ప్రతి ఒక్క దాంట్లో తానే స్వయంగా పాల్గొంది.

ఈసారి సన్ రైజర్స్ జట్టు మొదటి నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శణ ఇవ్వడంతో కచ్చితంగా కప్‌ గెలుస్తుందని అంతా ఆశించారు. కానీ చివరి మ్యాచ్ అయిన ఫైనల్‌ లో ఘోరంగా విఫలం అవ్వడం తో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ మ్యాచ్‌ లో కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది.

జట్టు ను ప్రోత్సహిస్తూ చప్పట్లు కొడుతూ కూడా కావ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. కెమెరా కు కనిపించకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తూడుచుకున్న వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. కావ్య మేడం కోసం అయిన సన్‌ రైజర్స్‌ గెలవాల్సిన మ్యాచ్ అన్నట్టుగా చాలా మంది సోషల్ మీడియాలో ఆమె వీడియో కు కామెంట్స్ చేశారు.

సెలబ్రిటీలు సైతం కావ్య వైరల్‌ వీడియో పై స్పందించారు. కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధేసింది అంటూ బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబచ్చన్ స్పందించారు. ఫైనల్‌ మ్యాచ్ లో తనకు టచ్చింగ్‌ మూమెంట్‌ కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం అంటూ బిగ్ బి తన బ్లాగ్‌ లో రాసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన.. ఓటమిని పట్టించుకోకుండా రేపు మరో అవకాశం వస్తుందని భావించి సిద్ధం అవ్వాలి అన్నారు. కావ్య కి మద్దతుగా బిగ్ బి రాసిన బ్లాగ్ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. నెటిజన్స్ ఆ పోస్ట్ ను కావ్య ను మరియు ఎస్‌ఆర్‌హెచ్‌ ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేయడం జరిగింది.