కలిసే ఉన్నామని హింటిచ్చిన బిగ్‌బి కూతురు కోడలు
నవ్య నవేళి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. బిగ్ బి వేడుకలో సందడి స్పష్ఠంగా కనిపించింది.
By: Tupaki Desk | 11 Oct 2023 3:19 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూతురు కోడలు మధ్య గొడవలున్నాయంటూ చాలాకాలంగా మీడియాలో కథనాలొస్తున్నాయి. ఆ ఇద్దరూ ఎదురుపడినా పలకరించుకోరు. ఎవరికి వారు యమునా తీరే! అన్న చందంగా వ్యవహరిస్తారని హిండీ మీడియాల్లో కథనాలొచ్చాయి. కోడలు ఐశ్వర్యారాయ్ ని కుమార్తె శ్వేతాబచ్చన్ నందా అంతగా పట్టించుకోదని గుసగుసలు ఉన్నాయి.
దానికి ఆజ్యం పోస్తూ ఇటీవల ఓ ఈవెంట్లో శ్వేతాబచ్చన్ ప్రవర్తన సంశయాన్ని రేకెత్తించింది. నవ్య ఆమె తల్లి శ్వేత ఒకే ఈవెంట్‌కు హాజరైనప్పటికీ పారిస్‌లో ఐశ్వర్య ఆరాధ్యలతో కలిసి ఫోటోషూట్ కి ఎందుకు వెళ్లలేదు? అంటూ ప్రశ్న ఎదురైంది. నవ్య నవేళి- ఐశ్వర్య పారిస్‌లోని లోరియల్ కోసం ర్యాంప్‌పై నడిచారు. శ్వేత తన కుమార్తె నవ్య విషయంలో ఎంతో ఉత్సాహంగా కనిపించింది. తన సోషల్ మీడియా పోస్ట్ లో అది బయటపడింది. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్‌ను ట్యాగ్ చేయడం మిస్ అయింది. అయితే, నవ్య ఐశ్వర్య గురించి ప్రస్తావించకపోవడంతో నెటిజన్లు విస్తుపోయారు. ఐశ్వర్య పట్ల అసూయపడినందుకు నెటిజనులు శ్వేతను నిందించారు.
అయితే ఇలాంటి పుకార్ల నడుమ 2023 అక్టోబర్ 11 నాటికి తన 81వ ఏట అడుగుపెడుతున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ బర్త్ డే వేడుకల్లో కుటుంబమంతా ఓ చోటికి చేరి సందడి చేయడం ఇలాంటి పుకార్లన్నిటికీ చెక్ పెట్టడమేనని భావిస్తున్నారు. బిగ్ బి బర్త్ డే పార్టీలో నవ్య నవేళి- శ్వేతా నంద బచ్చన్ లతో కలిసి ఐశ్వర్యారాయ్ కనిపించింది. జయాబచ్చన్, అగస్త్య నంద, ఆరాధ్య బచ్చన్ కూడా ఈ వేడుకలో ఉన్నారు.
నవ్య నవేళి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. బిగ్ బి వేడుకలో సందడి స్పష్ఠంగా కనిపించింది. వీటిలో ఒక ఫోటోలో జయ బచ్చన్- అగస్త్య నందాతో పాటు నవ్య -ఆరాధ్య పోజులిస్తుండగా, అమితాబ్ బచ్చన్ మధ్యలో నిలబడి ఉన్నారు. పుట్టినరోజు వేడుకల నుండి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ మిస్సయినట్టు తెలుస్తోంది. ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కనిపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. వీడియోలో, బిగ్ బి తన అభిమానులను పలకరించడానికి బయటకు వెళ్లి వారి వైపు చేయి వేసినప్పుడు ఐశ్వర్య - ఆరాధ్య తలుపు వెనక నుండి చూస్తున్నారు. ఒక వీడియోలో ఐశ్వర్య -నవ్య దగ్గరగా కనిపించారు. ఒకరికొకరు మాట్లాడుతూ కనిపించారు. ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ తో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. స్మాల్ బచ్చన్ కెరీర్ పరంగా బిజీ. ఆన్ లొకేషన్ ఉండడంతో కుదరలేదు. అమితాబ్ బచ్చన్ తన పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకోవడమే కాకుండా అర్ధరాత్రి జల్సా వెలుపల తన అభిమానులతోను కొంత సమయం గడిపారు.