Begin typing your search above and press return to search.

హనుమాన్ టీమ్ కు అమిత్ షా సడన్ సర్ ప్రైజ్

పెద్దగా అంచనాల లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   12 March 2024 2:33 PM GMT
హనుమాన్ టీమ్ కు అమిత్ షా సడన్ సర్ ప్రైజ్
X

పెద్దగా అంచనాల లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో మోస్తారుగా పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా డబుల్ ప్రాఫిట్ కంటే కాస్త ఎక్కువగా రాబట్టుకుని సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతకుమించి అనేలా సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలను అందించి బెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

సినిమాలో హనుమంతుడి కాన్సెప్ట్ ఉండడంతో హిందువులకు సినిమా ఊహించన దానికంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. అలాగే విడుదల టైమ్ లోనే లోనే రామ మందిరం ప్రతిష్టాపన జరగడం సినిమాకు మరింత హెల్ప్ అయింది. ఇక మేకర్స్ కూడా కలెక్షన్స్ లో కొంత డబ్బును రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం కూడా అందరినీ ఆకర్షించింది.

హనుమాన్ టీమ్ ప్రమోషన్స్ అలాగే తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను కూడా ఆకర్షించాయి. ఇక అనుకున్నట్లే బిజెపి టాప్ లీడర్ లో ఒకరైన అమిత్ షా ప్రత్యేకంగా హనుమాన్ యూనిట్ ను కలుసుకున్నారు. తెలంగాణలో జరిగిన బీజేపీ మీటింగ్స్ కు హాజరైన అమిత్ షా అనంతరం హనుమాన్ చిత్ర యూనిట్ సభ్యులను కలుసుకున్నారు.

నిర్మాత, దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే కథానాయకుడు తేజా సజ్జా ప్రత్యేకంగా అమిత్ షా తో మాట్లాడడం కూడా జరిగింది. ఇక చిత్ర యూనిట్ ప్రత్యేకంగా హనుమాన్ ఐడాల్ ను కూడా కానుకగా అమిత్ షాకు ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక గతంలో అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇప్పుడు తేజ సజ్జాతో కూడా ఆయన ప్రత్యేకంగా ఫోటోలకు స్టిల్ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక గతంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హనుమాన్ చిత్ర యూనిట్ ను కలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణకు వచ్చిన అమిత్ షా వారిని కలుసుకొని ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా వారి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న జై హనుమాన్ గురించి కూడా అమిత్ షాకు వివరించారని తెలుస్తోంది.