వీరమల్లు విషయాలేమి లేవా రత్నం గారు?
ఈ మూవీ రెండేళ్లు అయినా ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు.అయితే ఆ విషయాలేవీ ఏఎం రత్నం పట్టించుకోవడం లేదు.
By: Tupaki Desk | 26 July 2023 5:38 AM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్టార్ యాక్టర్ ఎంజీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్ఠీఆర్ తో సమానమైన నటుడుగా తమిళనాట ఆయనకి గుర్తింపు ఉంది. ఎన్ఠీఆర్ తరహాలోనే రాజకీయాలలోకి అడుగుపెట్టి తమిళ ప్రజల ఆరాధ్యదైవంగా మారిపోయాడు. ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీకి సంబందించిన దనంతరం బాధ్యతలు జయలలిత తీసుకొని ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పటికి తమిళ ప్రజలకి ఎంజీఆర్ ఆరాధ్య దైవం అని చెప్పాలి. అలాంటి ఎంజీఆర్ తో పవన్ కళ్యాణ్ ని పోల్చడం అంటే మామూలు విషయం కాదు. అయితే పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడైన నిర్మాతగా ఏఎం రత్నం మాత్రం పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఎంజీఆర్ తో సమానమైన స్థాయి, గుర్తింపు ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ నిర్మాత పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రెండేళ్లు అయినా ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు.
అయితే ఆ విషయాలేవీ ఏఎం రత్నం పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి పదేపదే చెబుతూ ఉంటారు. తాజాగా బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎంజీఆర్ ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయని ఏఎం రత్నం అన్నారు. ఎంజీఆర్ తన సినిమాలలో కచ్చితంగా ఒక్క సందేశాత్మక సాంగ్ అయిన ఉండేలా చూసుకునేవారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమాలో కచ్చితంగా ఓ సందేశాత్మక సాంగ్ కోరుకుంటారు. అలాగే ఖుషి సినిమాలో ఏ మే రాజహా అనే హిందీ సాంగ్ ని మొదటిసారి పెట్టడం జరిగిందని అన్నారు. అప్పటి వరకు ఎవరూ కూడా అలాంటి ప్రయోగాలు చేయలేదని చెప్పారు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఏఎం రత్నం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో గుర్తుచేసుకున్నారు.
ఇక హరిహరవీరమల్లు గురించి మాత్రం నిర్మాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం ద్వారా సినిమా ఆర్ధిక కారణాల వలన ఆగిపోయిందనే ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. రాజకీయ ప్రయాణం వలన మూవీ వాయిదా పడిందని, ఆగిపోలేదని ఇప్పటికే ఏఎం రత్నం కూడా ఓ మీడియా ఛానల్ కి సినిమాపై క్లారిటీ కూడా ఇచ్చారు.